
మహాధర్నాకు తరలిరండి
మదనపల్లె: వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5న చిత్తూరు కలెక్టరేట్ వద్ద జరగనున్న మహాధర్నాకు ప్రజలు తరలి రావాలని ఆ పార్టీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి హరిరాయల్ కోరారు. ఆయన మంగళవారం మదనపల్లెలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షు లు శరత్‌యాదవ్ ఆదేశాల మేరకు మహాధర్నాకు మదనపల్లె నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో యువకులను చిత్తూరుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. నేడు హామీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రుణమా ఫీ విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు.
ఓ వైపు మహిళలు, మరోవైపు రైతులు రుణాలకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి మాత్రం విదేశీ పర్యటనల పేరుతో కాలయాపన చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేం దుకు వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి నుంచి యువకులు తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ కార్మిక విభాగం జిల్లా ఉపాధ్యక్షులు షరీఫ్, కౌన్సిలర్ మహమ్మద్ఫ్రీ పాల్గొన్నారు.