
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట చెవిరెడ్డి ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం ధర్నాకు దిగారు.
చిత్తూరు : చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం ధర్నాకు దిగారు. చల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
ఎర్రావారిపాలెం మండలం ఎలమంద గ్రామానికి చెందిన 110 మంది రైతులు చల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా తమ పొలాలు కోల్పోయారని, వీరికి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా జిల్లా కలెక్టర్ లేకపోవడంతో గ్రీవెన్స్‌సెల్‌లో వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు.