సాక్షి, చిత్తూరు: పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్ది టీడీపీ నేతలు భారీగా నగదు, మద్యం పంపిణీకి తెరలేపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పలు చోట్ల టీడీపీ నాయకులకు చెందిన డబ్బులను, మద్యాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా రేణిగుంటలో టీడీపీ నాయకునికి చెందిన ఓ భవనంలో రూ. 20 కోట్ల రూపాయలు దాచి ఉంచినట్టు వార్తలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకులతో టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు తనిఖీలకు చేయడానికి సిద్దమవ్వగా.. టీడీపీ నాయకులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
చంద్రగిరిలో భారీగా నగదు, మద్యం పట్టివేత..
చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం మండలం కుప్పం బాదురు వద్ద మద్యం, నగదుతో వెళ్తున్న టీడీపీ వావానాన్ని పట్టుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. ఆ వాహనం నుంచి పోలీసులు మూడున్నర లక్షల రూపాయల నగదుతోపాటు, 6 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిట్టఖండ్రిగ గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు, మహేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment