జల్లికట్టు ముఖ్య అతిథిగా బాలకృష్ణ
జల్లికట్టు పోటీలకు సినీ హీరో బాలకృష్ణ ముఖ్య అతిథిగా వెళ్లనున్నారు. పొరుగునే ఉన్న తమిళనాడులో నిర్వహించిన మాదిరిగానే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లె వాసులు జల్లికట్టు పోటీలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు.. సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఆహ్వానించారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం జరిగే పోటీలను ఆపాలని పోలీసులు నిర్వాహకులను ఇప్పటికే కోరారు. అయినప్పటికీ నిర్వహకులు పోటీలను జరపాలనే పట్టుదలతో ఉన్నారు.