చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాబట్లపల్లె సమీపంలో భారీగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.
చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాబట్లపల్లె సమీపంలో భారీగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడి హస్తం ఉందని డ్రైవర్... పోలీసులకు తెలిపాడు. దీంతో బొజ్జల అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని పోలీసులు చెప్పారు.