
సాక్షి, చిత్తూరు : ఓం ప్రతాప్ మృతి కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు ఎమ్మెల్సీ లోకేశ్, టీడీపీ నాయకుడు వర్ల రామయ్య కూడా ఈ నోటీసులు పంపారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై ఆధారాలుంటే వారం రోజుల్లో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. సోమల మండలం పెద్దకాడ హరిజనవాడకు చెందిన ఓంప్రతాప్ (28) గతనెల 24న రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఓం ప్రతాప్ మృతిపై టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment