మరిన్ని విజయాలు సాధించాలి
రెడ్‌శాండల్స్ యాంటీ స్మగ్లింగ్ సెల్ టాస్క్‌ఫోర్స్‌కు ఎస్పీ అభినందన
కడప అర్బన్ : రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముగ్గురు ఎర్రచందనం స్మగర్లు బొడ్డె వెంకట రమణ, ముఖేష్ బదానియా, మణి అన్నన్‌లను అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో రెడ్‌శాండల్స్ యాంటీ స్మగ్లింగ్‌సెల్ టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధైర్య సాహసాలతో స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకభూమిక పోషించిన సిబ్బందిని పేరుపేరున అభినందించారు.
భారీగా నగదు రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారులు, సిబ్బంది మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన నలుగురు డీఎస్పీలకు డీజీపీ కమాండేషన్ లెటర్ కోసం ఎస్పీ సిఫార్సు చేశారు. అలాగే నలుగురు ఇన్‌స్పెక్టర్లకు మెరిటోరియస్ సర్వీసు ఎంట్రీ ప్రకటించారు. అలాగే నగదు రివార్డులను ఎస్పీ చేతుల మీదుగా అందుకున్నారు.
రివార్డులు అందుకున్న అధికారులు, సిబ్బంది
ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కృషి చేసిన డీఎస్పీలు ఫ్యాక్షన్ జోన్ బి.శ్రీనివాసులు, ఎస్‌బీ డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి, రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, సీఐలు బి.రాజేంద్రప్రసాద్, శ్రీరాములు, బీవీ శివారెడ్డి, వెంకటప్ప, ఆర్‌ఐ హరికృష్ణ, ఎస్‌ఐలు ఎస్‌కే రోషన్, హేమకుమార్, శివశంకర్, రాజరాజేశ్వర్‌రెడ్డి, రమేష్‌బాబు, పెద్ద ఓబన్న, కేవీ కొండారెడ్డి, ఎ.సురేష్‌రెడ్డి, అన్సర్‌బాష, ఎస్.మహబూబ్‌బాష, నాగమురళి, ఎస్‌బీహెచ్‌సీ మనోహర్‌వర్మ, హెచ్‌సీలు శ్రీనివాసులు, నాగార్జున, కానిస్టేబుళ్లు శ్రీహరి, వెంకటేశు, ప్రసాద్‌నాయుడు, కొండయ్య, శేఖర్, శ్రీనివాసులు, ఎస్‌కే నిస్సార్‌బాష, కె.రామకృష్ణ, రాజేంద్ర, సి.చంద్రశేఖర్, చంద్రశేఖర్, బి.సురేష్, ఎ.రవిశేఖర్, ఎన్.ప్రసాద్‌బాబు, శేఖర్, హోం గార్డు ఎ.విద్యాపతి, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ సి.రామలింగ ఆచారి నగదు రివార్డులు అందుకున్నారు.