‘ఎర్ర’ దొంగల అరెస్టు | red sandal smugglers arrest | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’ దొంగల అరెస్టు

Published Sat, Apr 15 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

‘ఎర్ర’ దొంగల అరెస్టు

‘ఎర్ర’ దొంగల అరెస్టు

చిలమత్తూరు (హిందూపురం) : విలువైన ఎర్రచందనం దుంగలను కర్ణాటకకు అక్రమంగా తరలిస్తూ గతంలో తప్పించుకున్న ముగ్గురు దొంగలను ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు హిందూపురం రూరల్‌ సీఐ నాగరాజానాయుడు శనివారం చిలమత్తూరు పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు తెలిపారు. అరెస్టైన వారిలో అనంతపురం రాణినగర్‌కు చెందిన పి.బాబ్జాన్‌, జి.వెంకటరాజు, ఉప్పర హరి అనే వ్యక్తులు ఉన్నారని వివరించారు. వీరిని కొడికొండ చెక్‌పోస్టు సమీపంలోని టూరిజం హోటల్‌ సమీపంలో ఉండగా ఎస్‌ఐ శ్రీధర్‌, తమ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారని సీఐ తెలిపారు. ఇదే కేసులోని హైదరాబాద్‌కు చెందిన హరీ అనే మరో దొంగ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఏఎస్‌ఐ సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement