జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ల వ్యవహారం ఫారెస్ట్ అధికారులకు తలనొప్పిగా మారింది
చిత్తూరు: జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ల వ్యవహారం ఫారెస్ట్ అధికారులకు తలనొప్పిగా మారింది. వారి ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి వద్ద టెంపోలో స్మగ్లర్ల స్థావరాలపై సోదాలు నిర్వహించారు.
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో విలువైన ఎర్రచందనాన్ని అక్కడే వదిలి స్మగ్లర్లు పరారైనట్టు పోలీసులు పేర్కొన్నారు.