కోకాకోలా సరస్సును ఎప్పుడైనా చూశారా..? | Brazil Has A Lake Named Coca Cola | Sakshi
Sakshi News home page

కోకాకోలా సరస్సును ఎప్పుడైనా చూశారా..?

Published Sun, Sep 26 2021 12:39 PM | Last Updated on Sun, Sep 26 2021 12:48 PM

Brazil Has A Lake Named Coca Cola - Sakshi

Coca Cola Lake: ఎప్పుడైనా ‘కోకాకోలా’లో ఈత కొడుతున్నట్లు కలకన్నారా? అయితే, ఇప్పుడ ఆ కలను నిజం చేసుకోండి. ఆశ్చర్యపోతున్నారా! నిజం, బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో నార్టే దక్షిణ తీరంలో ‘కోకాకోలా సరస్సు’ ఉంది. అసలు పేరు ‘లగోవా ద అరారాక్వారా’. ఇందులోని నీరు, అచ్చం కోకాకోలా రంగులా ఉంటే, రుచి మాత్రం సాధారణ నీటి కంటే కాస్త ఉప్పగా ఉంటుంది.

ఐరన్, అయొడిన్‌ సహా కొన్ని రసాయనాల కారణంగా దీనికి ఆ రంగు వచ్చిందని, పైగా ఇవి శరీరానికి ఏ హాని చేయవని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు నిరూపించారు. దీంతో చాలామంది ఈ సరస్సులో ఈత కొట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పైగా వేసవిలో ఇక్కడ స్పెషల్‌ వాటర్‌ ప్రోగ్సామ్స్‌ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సరస్సు పర్యాటకులతో కిటకిటలాడుతోంది. మీరు కూడా ఈ కోకాకోలా సరస్సులో ఈత కొట్టాలనుకుంటే, బ్రెజిల్‌ వెళ్లాల్సిందే మరి.

చదవండి: ఆ గ్రామం.. కోట్ల ఏళ్లుగా సజీవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement