గుంటూరు జిల్లా నగరం మండలం చిరకాలవారిపాలెం గ్రామంలోని చెరువులో ఆదివారం సాయంత్రం ఓ బాలుడి మృతదే హం లభ్యమైంది.
నగరం: గుంటూరు జిల్లా నగరం మండలం చిరకాలవారిపాలెం గ్రామంలోని చెరువులో ఆదివారం సాయంత్రం ఓ బాలుడి మృతదే హం లభ్యమైంది. మృతుడు నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన పమిడిమర్రు గ్రామానికి చెందిన ఆలమూరు ప్రమోద్(15) గా గుర్తించారు.
ప్రమోద్‌కు మతిస్థిమితం సరిగా ఉండదు అని గ్రామస్తులు తెలిపారు. నాలుగు రోజులు క్రితమే ప్రమోద్ తల్లిదండ్రులు బాలుడు కనిపించటంలేదని నగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.