కృష్ణశాస్త్రిగారు ప్రకృతి ప్రేమికులు. ఎక్కడో దేనికో హర్ట్ అయ్యారు. ‘లేవు నాకు ఉగాదులు, లేవు నాకు ఉషస్సులు’ అని కవిత్వంలో చింతించారు. ఫస్ట్ టైమ్ ఈ ఏడాది మనకూ ఉగాదులు, ఉషస్సులు లేకుండా పోయాయి. యూత్‌ది ఇంకో ప్రాబ్లమ్. లేవు వారికి సినిమాలు. లేవు వారికి సాయంత్రాలు. కరోనా ఎఫెక్ట్. కవిత్వం చదివే జనరేషన్ కూడా కాదు. కాళ్లూ చేతులు ఆడటం లేదు. ఓవర్–ది–టాప్ అని ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారు? వీళ్ల బాధను చూళ్లేక ఇజ్రాయిల్‌లో ఇప్పుడు సాయంత్రపు ‘సెయిల్–ఇన్’ సినిమాలను ప్రదర్శిస్తున్నారు! ఒక సరస్సును చూసుకుంటారు. అందులో ఓ గట్టు వైపు తెర కడతారు.
సరస్సులోని నీళ్ల పై తేలియాడే చిన్న చిన్న పడవల్లో సీట్‌లను అరేంజ్ చేస్తారు. వాటిల్లో ఆసీనులై ఒకరికొకరు దగ్గరవకుండా, పొరపాటున దగ్గరయే ప్రమాదం ఏర్పడితే దూరంగా జరుగుతూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమా చూడొచ్చు. మొదట టెల్ అవివ్ మున్సిపాలిటీ అక్కడి సరస్సులో ఈ సెయిల్–ఇన్ మూవీలు ప్రారంభించింది. ఆగస్టు చివరి వరకు రోజూ సాయంత్రం రెండు షోలు వేస్తున్నారు. యవ్వనస్తులు ఎలాగూ సూర్యుడు భూమధ్య రేఖమీదకు వచ్చేవరకు లేవరు కనుక వారికి ఉషస్సులతో పని లేదు. వీళ్లు లేకుండా సాయంత్రాలకు, సినిమాలకు ఎలాగూ పొద్దుపోదు. ఇక ఉగాదులు అంటారా? ఒక్క ఉగాది అనేముందీ. ప్రతిరోజు పండుగ రోజే.. సినిమాలు ఆడుతుంటే.
Comments
Please login to add a commentAdd a comment