Krishna Shastri
-
దేశంలో సెకనుకో సైబర్ దాడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి సెకనుకో సైబర్ దాడి జరుగుతోందని సైబర్ క్రైమ్ నిపుణుడు పెండ్యాల కృష్ణశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ప్రతి 11 సెకన్లకు ఓ సంస్థ లేదా వ్యక్తిపై ర్యాన్సమ్వేర్ దాడి జరుగుతోందన్నారు. బుధవారం హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తగా నిర్వహించిన హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమిట్ (హాక్)–2023లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమిట్‌కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కృష్ణశాస్త్రి ప్రసంగిస్తూ... ‘అనునిత్యం ఇంటర్నెట్లోకి 9 లక్షల కొత్త మాల్వేర్ వచ్చిపడుతోంది. వీటిలో ఏ రెండింటికీ సారూప్యత ఉండట్లేదు. కోవిడ్‌కు ముందు చిన్న, మధ్య తరహా సంస్థల్లో 53 శాతం ఈ ఎటాక్స్ బారినపడితే.. కోవిడ్ తర్వాత ఇది 68 శాతానికి చేరింది. ఈ నేరాల్లో ఐడెంటిటీ థెఫ్ట్‌తోపాటు ఉద్యోగులు చేసే డేటా చోరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల రాజకీయ కారణాలతోనూ సైబర్ దాడులు జరుగుతున్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో 65 నుంచి 70 శాతం కంప్యూటర్లను వాళ్లకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకుంటున్నారు. వీటిని క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం వాడుతున్నారు. ఈ తరహా సంస్థలు నిర్వహించే వారికి సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చాలా ఖరీదైన అంశంగా మారింది. ఈ ధోరణి మా రడంతోపాటు డేటా లీక్ ప్రివెన్షన్ పాలసీలు అమల్లోకి రావాలి. సాధారణ హైజీన్తో (శుభ్రత) పాటు సైబర్ హైజీన్ అన్నది కీలకంగా మారాలి. బ్యాంకులను పర్యవేక్షించడానికి ఆర్బీఐ ఉన్నట్లు చిన్న, మధ్య తరహా సంస్థల పర్యవేక్షణకు ఏ వ్యవస్థా లేకపోవడమూ ఓ లోపమే. వీటికి పోలీసులే రెగ్యులేటింగ్ అథారిటీ కావాలి. ఏదేనీ సంస్థ లేదా వ్యక్తికి చెందిన కంప్యూటర్లోకి చొరబడి, డేటాను తమ అధీనంలోకి తీసుకుని ఎన్‌క్రిప్ట్ చేయడం, డీ–క్రిప్షన్‌కు డబ్బు డిమాండ్ చేయడం... ర్యాన్సమ్వేర్ దాడుల్లో పైకి కనిపించే సైబర్‌నేరాలు. అయితే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకున్న డేటా ను తస్కరిస్తుంటారు. యూరోపియన్ హ్యాకర్లు ఆయా సంస్థలకు చెందిన కస్టమర్ డేటా తీసుకుంటారు. ఈ డేటా సేకరించడం అక్కడి చట్టాల ప్రకా రం తీవ్రమైన నేరం కావడంతో ఇలా చేస్తారు. భార త్‌కు చెందిన హ్యాకర్లను ఈ డేటా డార్క్ నెట్ సహా ఎక్కడైనా పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ర్యాన్సమ్వేర్ ఎటాకర్స్ ఆయా కంపెనీల సోర్స్ కోడ్‌ను తస్కరిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త కాల్స్‌కు స్పందించవద్దు ఈ సమిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హెచ్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి భరణి మధ్య ప్యానల్ డిస్కషన్ జరిగింది. తన యూనిట్లో పని చేసే కొండలు సైబర్ నేరంలో ఎలా మోసపోయాడు, తన స్క్రిప్‌్టలు భద్రంగా ఉంచుకోవడానికి తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను తదితర అంశాలను జక్కన్న వివరించారు. వివిధ సైబర్ నేరాలు జరిగే విధానం, వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వీరు చర్చించారు. ‘80 శాతం సైబర్ నేరాలు బాధితుల అవగాహనరాహిత్యం వల్ల, 20 శాతం దురాశ వల్ల జరుగుతుంటాయి. ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ సందేశం... వీటిలో దేనికైనా స్పందించే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆలోచించాలి. కొత్త వారి ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దు’ అని సూచించారు. -
సరస్సులో సినిమా
కృష్ణశాస్త్రిగారు ప్రకృతి ప్రేమికులు. ఎక్కడో దేనికో హర్ట్ అయ్యారు. ‘లేవు నాకు ఉగాదులు, లేవు నాకు ఉషస్సులు’ అని కవిత్వంలో చింతించారు. ఫస్ట్ టైమ్ ఈ ఏడాది మనకూ ఉగాదులు, ఉషస్సులు లేకుండా పోయాయి. యూత్‌ది ఇంకో ప్రాబ్లమ్. లేవు వారికి సినిమాలు. లేవు వారికి సాయంత్రాలు. కరోనా ఎఫెక్ట్. కవిత్వం చదివే జనరేషన్ కూడా కాదు. కాళ్లూ చేతులు ఆడటం లేదు. ఓవర్–ది–టాప్ అని ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారు? వీళ్ల బాధను చూళ్లేక ఇజ్రాయిల్‌లో ఇప్పుడు సాయంత్రపు ‘సెయిల్–ఇన్’ సినిమాలను ప్రదర్శిస్తున్నారు! ఒక సరస్సును చూసుకుంటారు. అందులో ఓ గట్టు వైపు తెర కడతారు. సరస్సులోని నీళ్ల పై తేలియాడే చిన్న చిన్న పడవల్లో సీట్లను అరేంజ్ చేస్తారు. వాటిల్లో ఆసీనులై ఒకరికొకరు దగ్గరవకుండా, పొరపాటున దగ్గరయే ప్రమాదం ఏర్పడితే దూరంగా జరుగుతూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమా చూడొచ్చు. మొదట టెల్ అవివ్ మున్సిపాలిటీ అక్కడి సరస్సులో ఈ సెయిల్–ఇన్ మూవీలు ప్రారంభించింది. ఆగస్టు చివరి వరకు రోజూ సాయంత్రం రెండు షోలు వేస్తున్నారు. యవ్వనస్తులు ఎలాగూ సూర్యుడు భూమధ్య రేఖమీదకు వచ్చేవరకు లేవరు కనుక వారికి ఉషస్సులతో పని లేదు. వీళ్లు లేకుండా సాయంత్రాలకు, సినిమాలకు ఎలాగూ పొద్దుపోదు. ఇక ఉగాదులు అంటారా? ఒక్క ఉగాది అనేముందీ. ప్రతిరోజు పండుగ రోజే.. సినిమాలు ఆడుతుంటే. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణశాస్త్రి
-
కవిత్వానికి కన్నీరద్దిన కవి జాషువ
కవులు మూడు రకాలుగా ఉంటారు. మొదటి రకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలానికి ప్రాతినిధ్యం వహించి, తర్వాతి కాలంలో తెరమరుగుకు వెళ్ళిపోతారు. భావ కవులు ఇలాంటి వాళ్ళు. రెండవ రకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలంలో సూర్యతేజంతో వెలిగిపోతారు. తర్వాతి కాలంలో తమ అవ సరం లేకపోయినా, తమవర్గ వారసుల ద్వారా చర్చలో నలు గుతూ ఉంటారు. పౌరాణిక చారిత్రక కవులు ఇలాంటి వాళ్ళు. మూడవరకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలంలో నిరాదర ణకు, వివక్షకు గురై తర్వాతి కాలంలో తిరుగులేని దీపధారు లుగా వెలుగొందుతారు. గురజాడ, గుర్రం జాషువ ఇలాంటి వారు. (‘‘గురజాడ 1915లో మరణించినా. ఆ తర్వాతనే జీవించడం ప్రారంభించారు’’ అన్న కృష్ణశాస్త్రి మాట జాషు వకు కూడా వర్తిస్తుంది.) గుర్రం జాషువ 19వ శతాబ్దం చివరలో పుట్టిన భారతీయ దళితకవి. సంఘ సంస్కర ణోద్యమం ఉచ్ఛదశలోను, భారత స్వాతంత్య్రోద్యమం పరిణామ దశలోను ఉండగా పుట్టి, నగ్జల్బరీ ఉద్యమం పురుడు పోసుకుంటున్న కాలం దాకా బతికిన కవి (28-9-1895 24-7-1971). భావకవిత్వం తొలిదశలో ఉన్నకాలంలో కలం బట్టి అభ్యుదయ సాహి త్యోద్యమ కాలమంతా గొప్ప రచనలు చేసిన కవి జాషువ. విప్లవ సాహిత్యం మొలకదశలో ఉండగా ఆయన మరణించాడు. 76 ఏళ్ళ జీవితంలో 50 ఏళ్ళకు పైగా సాహిత్య జీవితం గల జాషువ ఆధునిక తెలుగు కవులలో అనేకవిధాలుగా విశిష్టత గల కవి. సంఘ సంస్క రణ, భారత స్వాతంత్య్ర భావ, అభ్యుదయ కవిత్వాల సంగమం ఆయన. సగర మాంధాతాది షట్చక్రవర్తుల సంకీ ర్తన దశ నుంచి కొత్తలోక దర్శనం దాకా పరిణమించిన కవి జాషువ. దేవుడు లేడనే నాస్తికులను హెచ్చరించే దశ నుండి దేవుడినే హెచ్చరించే ధైర్యం చేసిన కవి. పద్య కవిత్వ యుగంలో పుట్టి, గేయం, పాట, వచన కవిత్వ యుగాలలో ప్రధాన రచనలు చేసినా, పద్య కవిగానే స్థిరపడిన కవి జాషువ. చాతుర్వర్ణ వ్యవస్థను వందలేళ్లుగా కీర్తించిన పద్యంతోనే ఆ వ్యవస్థను చీల్చి చెండాడాలన్న పట్టుదల కూడా కావచ్చు. శత్రువు ఆయుధంతోనే శత్రు వును జయించాలన్న లక్ష్యం కూడా కావచ్చు. ఆధునిక భావాలను అభివ్యక్త్తం చేయడానికి కూడా పద్యాన్ని ఉపయోగించవచ్చునని జాషువ నిరూపించాడు. భావకవులలో జాషువ ప్రత్యేకమైన కవి. ఆయన ఊహాలోక విహారి కాదు. వాస్తవ ప్రపంచ సంచారి. కావ్యఖండికలు, ఖండకావ్యాలు స్వీకరించి దైనందిన జీవిత సత్యాలనే చిత్రించాడు. వాటికి కండపుష్టి కలిగించాడాయన. తెలుగు కవిత్వంలో ‘జీవునివేదన’ స్థానంలో ‘జీవన వేదన’కు పీటవేసిన కవి జాషువ. పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక వస్తువులలో దేనిని స్వీకరించి కవిత్వం రాసినా, అందులో తనదైన దళితానుభవం అంత స్సూత్రంగా ఉంటుంది. భారతదేశ చరిత్రను జాషువ ఎక్కడా అగౌరవపరచలేదు. సామా జిక వ్యవస్థ మీద ఆర్థిక, సాంఘిక, రాజకీయ దృష్టి కోణాలనుంచి విమర్శనాత్మక కవిత్వం రాశాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవ వస్తువులన్నిటినీ కవిత్వీకరించాడు. గౌతమ బుద్ధుడు, ఏసుక్రీస్తు, గాంధీ వీరిని ఒక త్రయంగా జాషువ అనేక పర్యా యాలు కీర్తించాడు. అంబేడ్కర్‌ను గురించి జాషువ తక్కువగా పద్యాలు రాసినట్లు కని పిస్తున్నప్పటికీ. ఆయన కవిత్వమంతా అంబేడ్కర్ ప్రచారం చేసిన సౌభ్రాతృత్వ భావన పరచుకొని కనిపిస్తుంది. అంబేడ్కర్ బోధించిన ‘‘బోధించు, పోరాడు.’’ అనే గుణాలు ఆయన మరచిపోలేదు. మార్క్సిజాన్ని జాషువ జీవితావసానదశలో ఆమోదించినట్లు కని పిస్తుందిగాని, ఆయన మొదటి నుంచి శ్రమ దోపిడిని గర్హిస్తూ సమసమాజాన్నే కోరు కున్నాడు. ఈ రకంగా జాషువలో సమకాలీన సమాజంపై ప్రభావం చూపిన మూడు తాత్విక భావజాలాలు సంగమించాయనిపిస్తుంది. సాంఘిక వివక్ష, ఆర్థిక అసమానత, రాజకీయ అవినీతి, తాత్విక మౌఢ్యం ఈ నాల్గింటిపైన జీవిత కాలం యుద్ధం చేసిన విశిష్ట కవి జాషువ. ‘నాది కలికి తెలుగు కులము’ అని గర్వంగా చెప్పుకున్నాడు. స్వాతంత్రం వచ్చిన వెంటనే ‘‘అచ్చముగ భారతీ యుడనైతి నేడు’’ అని ప్రకటించాడు. ‘‘విశ్వనరుడ నేను’’ అని అనేక పర్యాయాలు చాటుకున్నాడు. గుర్రం జాషువ నిబద్ధత గల కవి. ఆయన నిబద్ధత బహుముఖీనమైనది. క్రైస్తవుడని హిందువుల చేత, హిందూకావ్యాలు రాస్తున్నాడని క్రైస్తవుల చేత నిరాదరణకు గురైనజాషువ ముస్లిం సమాధులలో కూర్చొని చదువుకున్నాడని ఆయన జీవిత చరిత్ర కారులు చెబుతారు. ఆయన ఎంతైనా పద్యకవే గదా అని ఆధునికులు, ఆయన సాంఘిక విమర్శను చూసి సంప్రదాయవాదులు జాషువను నిరాదరించినా తనంతట తానుగా విశిష్ట కవిగా ఎదిగాడు. ఆయన కవిత్వం తాను జీవించి రచించిన కాలం నాటికన్నా ఇవాళ ఎక్కువగా ప్రజలకు సన్నిహితమైంది. అదే ఆయన విశిష్టత. అదే ఆయన విజయం. (నేడు గుర్రం జాషువ 45వ వర్ధంతి సందర్భంగా) వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు మొబైల్ : 9440222117 - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి -
‘ఆదిమ’ గుహలను మింగిన క్వారీలు
కోకాపేట గుహల్లో అద్భుత వర్ణ చిత్రాలు మూడున్నర వేల ఏళ్ల క్రితం నాటి ఆధారాలు 35 ఏళ్ల క్రితమే గుర్తించిన నాటి పురావస్తు డెరైక్టర్ కృష్ణశాస్త్రి ఆ తర్వాత పట్టించుకోని ప్రభుత్వాలు క్వారీలతో ధ్వంసమైన గుట్టలు, కనుమరుగైన చిత్రాలు మూడొంతులు పోగా మిగిలినవి కొన్నే హైదరాబాద్ శివారులోనే మసకబారుతున్న ఆదిమ చరిత్ర సాక్షి, హైదరాబాద్: మానవ పరిణామక్రమాన్ని తెలుసుకునేందుకు ఆదిమ కాలం నాటి ఆధారాలే కీలకం. అందుకే అలాంటి ఆనవాళ్లున్న ప్రదేశాలను ప్రభుత్వాలు పదిలంగా కాపాడుతుంటాయి. అవి పరిశోధకులకు, పర్యాటకులకు కేంద్రంగా నిలుస్తాయి. అప్పటి గుహలు, సమాధుల్లో లభించే ఆధారాలే నేటి తరానికి గొప్ప వారసత్వ సంపద. హైదరాబాద్ శివారులోనే ఉన్న అలాంటి ప్రాం తం క్రమంగా కాలగర్భంలో కలి సిపోతోంది. అది నిర్దాక్షిణ్యంగా క్వా రీల పాలైంది. అక్కడి అతి అరుదైన, పురాతన సాక్ష్యాలన్నీ ధ్వంసమయ్యాయి. దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. దీంతో దాదాపు 3500 సంవత్సరాల క్రితం నాటి ఆదిమ మానవులు గీసిన ‘చిత్ర’ విన్యాసాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ధ్వంసమైందిలా... క్రమంగా నగరం విస్తరించడంతో గండి పేట చుట్టూ నివాసాలు వెలిశాయి. ఈ క్రమంలో ఆదిమానవుల చిత్రాలున్న గుట్టలు క్వారీలకు బలయ్యాయి. అయితే ఆదిమానవుల చిత్రాలున్న ఓ గుహను స్థానికులు పురాతన ఆలయంగా భావించేవారు. దాన్ని కూల్చితే అరిష్టం జరుగుతుందని భావించి ఆ ఒక్క దాన్ని మాత్రం వదిలి మిగతా గుట్టను పూర్తిగా ధ్వంసంచేశారు. కానీ పేలుళ్ల ధాటికి గుహలోని చిత్రాలు చాలావరకు దెబ్బతిన్నాయి. గుహ పైకప్పు పొర దెబ్బతిని అక్కడి చిత్రాలు పూర్తిగా పోయాయి. క్వారీ దుమ్ము, వ ర్షం నీటితో కొన్ని చిత్రాలు పూర్తిగా మసకబారిపోయాయి. ఎద్దుల సమూహం.. ఆ మొత్తాన్ని నియంత్రిస్తున్న ఓ వ్యక్తి.. అతని ముందు చేప ఆకారంతోపాటు మరోచోట కొందరు వ్యక్తులు నృత్యం చేస్తున్నట్టు ఉన్న చిత్రాలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థల యజమానులతో చర్చించి కోకాపేట గుహలను రక్షిత ప్రాంతంగా గుర్తించాలి. మిగిలిన చిత్రాలనైనా పదిలపరచాలి. కూతవేటు దూరంలోనే.. నగర దాహార్తిని తీర్చే గండిపేట చెరువుకు కూతవేటు దూరంలో కోకాపేట శివారులోని గుట్టపై పురాతన గుహలు ఉన్నాయి. వాటిలో ఆదిమ మానవుల కాలం నాటి చిత్రాలున్నాయి. అయితే ఈ స్థలం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండటంతో దాన్ని క్వారీలుగా మార్చేశారు. అక్కడి గుట్టలను పేల్చేశారు. దీంతో ఇక్కడి 2 గుహల్లో ఇప్పటికే ఒకటి పూర్తిగా ధ్వంసమైంది. చుట్టూ గుట్టను తొలిచేసి మరో గుహను మాత్రం మిగిల్చారు. 130 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గుహను చేరుకోవడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది. ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా ఇలాంటి గుహలు 16 మాత్రమే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చారిత్రక ప్రాంతాలను ప్రజలకు చేరువ చేసిన వేలూరి వెంకట కృష్ణశాస్త్రి ఈ కోకాపేట గుహలను కూడా 1980లోనే అధికారికంగా గుర్తించారు. అప్పట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ పురావస్తు విభాగం సంచాలకులుగా ఉన్నారు. వృద్ధాప్యంతో ఆయన పరిశోధనలకు దూరం కావడంతో ఈ గుహల సంగతి మరుగునపడింది. ఆ తర్వాత ప్రభుత్వాలకు అసలు అక్కడ గుహలున్న సంగతే తెలియలేదు. ‘ప్రోటో హిస్టారికల్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకంలో కృష్ణశాస్త్రి ఈ గుహల వివరాలను పదిలపరిచారు. కంటికి రెప్పలా కాపాడాలి ‘ఆదిమానవులు చిత్రించిన రాతి చిత్రాలు అత్యంత విలువైనవి, అంతకుమించి అరుదైనవి. భావి తరాలకు వాటి గొప్పతనం తెలియాలంటే వాటిని కంటికి రెప్పలా కాపాడాలి. అవి ధ్వంసమైతే మళ్లీ దొరకవు. హైదరాబాద్‌లాంటి నగరానికి అలాంటి గుహలు అతి చేరువలో ఉండటం ఓ రకంగా అదృష్టమే. త్వరలో దాన్ని పరిశీలిస్తాను’ - డాక్టర్ ఎన్ చంద్రమౌళి, రాక్ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి