ముంబై: సాధారణంగా చేపలు పట్టడం కొందరికి హాబీ అయితే, మరికొందరికి జీవనోపాధిగా ఉంటుంది. అయితే చేపల వేట కోసమని వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.
చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు!
వివరాల్లోకి వెళితే.. ఒక ఆదివాసీ తెగకు చెందిన 40 ఏళ్ల విజయ్ కాక్వే చేపలు పట్టేందుకు ముంబైలోని పొవై ప్రాంతంలోని చెరువు వద్దకు వెళ్లాడు. ఒడ్డున కూర్చోని చేపలు పడుతున్నాడు. ఇంతలో అతనిపై ఓ మొసలి దాడి చేసింది. ఎట్టికేలకు అతను మొసలితో పోరాడి దాని నోట్లో పడకుండా బయటపడ్డాడు కానీ ఈ దాడిలో అతని కాలికి తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు కాక్వేని ఘట్కోపర్‌లోని రాజవాడి ఆస్పత్రికి తరలించారు. పొవై సరస్సు అంచున నిర్మించిన ర్యాంప్ వల్ల ఈ మొసలి దాడి నుంచి బయటపడినట్లు స్థానికులు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బీఎంసీ అధికారులు ఆ ప్రాంతంలో మరిన్ని వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అసలు కారణం ఇదేనా..
ప్రతి ఏడాదిలో ఈ సమయంలో.. మొసళ్ళు పొవై సరస్సు పక్కన మెత్తటి నేలపై గుడ్లు పెడుతుంటాయి. అయితే ఇప్పటికే, సరస్సు అవతలి వైపు, రెనైసాన్స్ హోటల్‌కు సమీపంలో చాలా నిర్మాణ కార్యకలాపాలు జరిగాయి. అలాగే, చాలా మంది పిక్నిక్ స్పాట్‌లుగా ఆ ప్రాంతానికి వెళ్లడం, సరస్సు సమీపంలో పార్టీలు లాంటివి జరగడంతో ఇవి ఆ సరస్సులోని సముద్ర జాతులకు ఆటంకంగా మారింది. ఈ కారణంగానే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.
చదవండి: ఉత్తరాఖండ్‌లో దారుణం.. కదులుతున్న కారులో తల్లీ, కూతురిపై సామూహిక అత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment