![Indian Student Found Dead In London Lake - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/21/indianStudent_img.jpg.webp?itok=CYQNEmTs)
లండన్: గత వారం యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ సరస్సులో శవమై కనిపించాడు. డిసెంబర్ 14న అదృశ్యమైన గురష్మాన్ సింగ్ భాటియా(23 ) మృతదేహాన్ని కానరీ వార్ఫ్ సరస్సులో డైవర్లు బుధవారం గుర్తించారు.
లాఫ్‌బరో యూనివర్శిటీకి చెందిన విద్యార్థి గురష్మాన్ సింగ్ భాటియా డిసెంబర్ 14న రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ క్రమంలో కానరీ వార్ఫ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చివరిసారిగా సౌత్ క్వే ప్రాంతంలోని సీసీటీవీలో డిసెంబర్ 15న కనిపించాడు. కానీ ఆ తర్వాత ఆయన జాడ తెలియలేదు. చివరగా బుధవారం కానరీ వార్ఫ్ ప్రాంతంలోని సరస్సులో డైవర్లకు గురష్మాన్ సింగ్ మృతదేహం కనిపించింది.
గురష్మాన్ సింగ్ మరణవార్త సమాచారాన్ని పంజాబ్‌లోని ఆయన కుటుంబానికి అందించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేపడుతామని డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ జేమ్స్ కాన్వే చెప్పారు. గురష్మాన్ సింగ్ అదృశ్యంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పందించారు. గత నెలలో కూడా యూకేలో భారతీయ విద్యార్థి థేమ్స్ నది ఒడ్డున శవమై కనిపించాడు.
ఇదీ చదవండి: కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?
Comments
Please login to add a commentAdd a comment