గ్రేటర్‌లో చెరువుల అభివృద్ధికి గ్రహణం పట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 185 చెరువులకు గానూ..19 చెరువులనుతొలివిడతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఏడాది క్రితం నిర్ణయించింది. ఇందుకోసం రూ.280 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించింది. కానీ ఏడాదిగా ఇందులో కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులుఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పూర్తి చేసిన పనులకు గాను రూ.10 కోట్ల మేర పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మరో వైపు డంపింగ్ యార్డులుగా మారిన ఆయా చెరువుల్లో తాము తొలగించిన ఘన వ్యర్ధాల పరిమాణం ఆధారంగా బిల్లులు చెల్లించడం లేదని పనులు చేపట్టిన ఏజెన్సీలు వాపోతున్నాయి. మరోవైపు పలు చెరువులు అక్రమార్కుల చెరలో చిక్కి డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా హఫీజ్‌పేట్‌లోని కాయిదమ్మకుంట నిలుస్తుంది.
అక్రమార్కుల చెరలో హఫీజ్‌పేట్ కాయిదమ్మకుంట
Published Thu, Jan 9 2020 5:26 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement