
‘నీరు’పయోగమే..!
► రబీ పంటలకు సాగునీటి కష్టాలు
► ఏళ్ల తరబడిగా మరమ్మతుకు నోచుకోని కాలువలు
► చెరువులకు కాలువలు కరువు
ఇచ్చోడ : ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జల కళను సంతరించుకున్నారుు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల్లో పూడిక తొలగించడం, తూములు, కట్టల మరమ్మతు చేపట్టడం కారణంగా నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నారుు. కాని ఆయకట్టులో సాగవుతున్న పంటలకు చుక్క నీరందే పరిస్థితి లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో రబీ పంటలు 70 శాతం వరకు సాగయ్యూరుు. ప్రాజెక్టు, చెరువుల కాలువలు ఏళ్ల తరబడిగా మరమ్మతుకు నోచుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోయూరుు. దీంతో చివరి ఆయకట్టులోని పంటలకు నీరందుతుందో లేదోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు మధ్య తరహా ప్రాజెక్టులు తాంసి మండలం మత్తడివాగు ప్రాజెక్టు, ఆదిలాబాద్ మండలం సాత్నాల ప్రాజెక్టు ఉన్నారుు.
సాత్నాల ప్రాజెక్టు కింద 14 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా.. కాలువలు మరమ్మతుకు నోచుకోకపోవడంతో లక్ష్యం మేరకు సాగునీరు అందడం లేదు. చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి నెలకొంది. మత్తడివాగు ప్రాజెక్టు కుడి కాలువ దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మించినా సాగునీరు అందించే పరిస్థితి లేదు. కాలువలో పిచ్చిమొక్కలు పెరిగిపోరుు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్మించి 12 ఏళ్లు కావస్తున్నా కుడి కాలువ పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 8వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉన్నా.. వందల ఎకరాలకు కూడా నీరందడం లేదని రైతులు వాపోతున్నారు.
కాలువలు లేని చెరువులే అధికం..
జిల్లాలో కాలువలు లేని చెరువులే అధికంగా ఉన్నారుు. ఇచ్చోడ మండలం అడేగామ కే, గేర్జం, సిరికొండ, గుడిహత్నూర్ మండలం మూత్నూర్, తొషం, సీతాగొంది గ్రామాల్లో చెరువులకు కాలువలు లేవు. బేల మండలంలో ఆరు చెరువుల ఉండగా వాటిలో సోన్‌కాస్ చెరువుకు మాత్రమే మట్టికాలువ ఉంది. వరూర్, సాంగ్వి, సాక్లి, పీడ్‌గావ్, కాప్సి గ్రామాల చెరువులకు కాలువల నిర్మాణం జరగలేదు. నేరడిగొండ మండలంలో వడూర్, కుమారి, వాంకిడి, పురుషోత్తంపూర్, బజార్‌హత్నూర్ మండలం భూతయి, జాతర్ల, కాండ్లి, తలమడుగు మండలంలో లింగి, ఝరి, బరంపూర్, నందిగామ, తాంసి మండలం తాంసి, అర్లి జల్‌కొటి గ్రామాల్లో చెరువులకు కాలువలు లేవు.
బజార్‌హత్నూర్ మండలం దెగామ చెరు వు కుడి కాలువ పనులకు సిమెంట్ లైనింగ్ ప నులు ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నా ప నులు పూర్తి కాలేదు. దీంతో రబీలో నీటిని వి డుదల చేసినా మూడు కిలోమీటర్ల దూరం కం టే ఎక్కువ పారే అవకాశాలు లేవు. ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో చెరువుల ద్వారా రబీకి నీరందించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది రబీలో ఒక్క సాత్నాల ఆయకట్టుకు మినహా మరెక్కడా నీరందే అవకాశాలు లేవు.