
సాక్షి, జగిత్యాల : కల్లెడ సమీపంలో అనంతారం వాగు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు జారీ వాగులో పడిపోయారు. జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ తన మిత్రుడితో కలిసి కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకుని తిరుగు ప్రయాణం కాగా వాగువద్ద ఈ ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి వాగులో పడిపోతుండగా వెనకాల కూర్చున్న వ్యక్తి తప్పించుకొగా, డ్రైవింగ్ చేసే శ్రీనివాస్ కొద్దిదూరం ఆ వరద ప్రవాహం కొట్టుకుపోయారు.అక్కడే ఉన్న స్థానికులుగమనించి వెంటనే ఆ యువకుడిని కాపాడారు. అయితే ఈ దృశ్యాలను బైక్ వెనక కారులో వస్తున్న వారు వీడియో చిత్రీకరించారు. (వాగులో చిక్కుకుని.. రాత్రంతా కారులోనే..)
Comments
Please login to add a commentAdd a comment