![- - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/03/4/Crime.jpg.webp?itok=gj8qQFLZ)
యాదాద్రి: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల ఎల్‌బీనగర్ శివారు జానపహాడ్ మేజర్ కాలువలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మృతదేహం 2022 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మేజర్ కాలువలో కొట్టుకు వచ్చినట్లు సీఐ చరమందరాజు ఆదివారం తెలిపారు.
మృతుడి దేహంపై తెలుపు రంగు లుంగీ, నీలి, తెలుపు రంగు గడులుగల ఫుల్‌షర్ట్ ఉన్నదని, భుజంపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యక్తిని ఎవరో వ్యక్తులు చంపి, చేతులు కట్టి, ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి కాలువలో పడవేసినారని పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు మేరకు గరిడేపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక సీఐ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment