
సరస్సులో పడిన ట్రక్ : 11 మంది దుర్మరణం
లీమా: పెరూ కుజికో ప్రాంతంలో 52 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్ బ్రిడ్జిపై నుంచి సరస్సులో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో 41 మంది గాయపడ్డారని మీడియా బుధవారం వెల్లడించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ... వెంటనే సహాయక చర్యలు చేపట్టి నీట మునిగిన ట్రక్ నుంచి ప్రయాణికులను రక్షించి ఆసుపత్రి తరలించినట్లు పేర్కొంది.
మృతుల్లో ఇద్దరు మహిళలు, 12 ఏళ్ల బాలిక కూడా ఉందని తెలిపింది. పెరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జూలై 28వ తేదీ. ఈ నేపథ్యంలో పెరూ రాజధాని లీమాలో దేశ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో నిర్వహించే పరేడ్లో పాల్గొనేందుకు 52 మంది ట్రక్ లో బయలుదేరారని మీడియా వివరించింది.