
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ మరింత అందమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. సాగర్ ను మరింత కనువిందుగా తీర్చి దిద్దేందుకు వేలాడే వంతెన లు నిర్మించేందుకు ప్రతి పాదనలు, రూపొందించారు. రష్యాలోని జీయాడు పార్క్ నుంచి రెడ్ స్క్వర్ వైపు ఉతరం వైపు ఉన్న మాస్కో నదిలోకి నిర్మించిన వేలాడే వంతెనల తరహాలోనే నెక్లెస్ రోడ్ నుంచి హుస్సేన్ సాగర్ లోకి వంతెనలను నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ కార్యధర్సి అరవింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మాస్కో నదిలోకి నిర్మించిన పై వంతెన ఫోటో దృశ్యాల్ని ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికల్లా హుస్సేన్ సాగర్ లేక్ వ్యూ ను మాస్కో నది తరహాలో అభివృధి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment