
మియాపూర్: దోమల నివారణకు వినియోగించే ఆలౌట్ లిక్విడ్‌ను తాగిన ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోయిర్ గ్రామానికి చెందిన ఎండీ జుబేర్, పరీ్వనా బేగం దంపతులు శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు.
జుబేర్ డ్రైవర్ పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జుబేర్ విధులకు వెళ్లగా.. పరీ్వనాబేగం ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఏడాదిన్నర బాలుడు అబ్బు జాకీర్ ఇంట్లో ఆడుకుంటూ దోమల నివారణకు వాడే ఆలౌట్ లికి ్వడ్‌ను తాగాడు. కొద్దిసేపు తర్వాత బాలుడు ఏడుస్తుండటంతో పరీ్వనాబేగం వెళ్లి పరిశీలించగా జాకీర్ నోట్లోంచి లిక్విడ్ వాసన వచి్చంది. చికిత్స నిమిత్తం నిలోఫర్‌కు తరలించారు. అక్కడ శుక్రవారం అర్ధరాత్రి జాకీర్ మృతిచెందాడు. బాలుడి తండ్రి జుబేర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment