అరటి పండ్లు పండిపోతున్నాయని పడేస్తున్నారా? | Bananas Going Bad Five Ways To Repurpose Overripe Bananas | Sakshi
Sakshi News home page

అరటి పండ్లు పండిపోతున్నాయని పడేస్తున్నారా? వాటితో ఎన్ని వంటకాలు చెయ్యొచ్చో తెలుసా

Published Fri, Feb 2 2024 11:10 AM | Last Updated on Fri, Feb 2 2024 11:26 AM

Bananas Going Bad Five Ways To Repurpose Overripe Bananas - Sakshi

మనం మార్కెట్‌ నుంచి అరటి పళ్లు తీసుకుస్తాం. కానీ వాటిని ఉపయోగించే లోపలే పాడేపోతుంటాయి. ఎందుకంటే? అరటిపళ్లు తొందరగా పండి పోతాయి. బాగా పండినవి తినలేం కూడా. వాటిని ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. చూస్తు..చూస్తూ.. పడేయబుద్ధికాక ఓ పక్కా..! మరోవైపు వృధా చేస్తున్నామేమో! అనే ఫీలింగ్‌తో తెగ బాధ పడిపోతుంటా. అందువల్లే చాలామంది అరటిపళ్లను ఇంట్లో జనం ఎక్కువమంది ఉన్నారు, తింటారు అనుకుంటేనే కొంటున్నారు. అలాంటప్పుడు అలా పండిన అరటి పండ్లను పడేయకుండా చక్కగా ఉపయోగించుకునేలా రెసిపీలు చేసుకోవచ్చట. అవేంటో చూద్దామా!.

మన వంటకాల్లో పండిన అరటి పళ్లును ఐదు రకాలుగా వాడొచ్చట. అంతేగాదు వాటితో చేసిన రెసిపీలను పిల్లలు పెద్దలు వదలకుండా లాగించేస్తారట కూడా. ఇంతకీ అవేంటంటే.

బనానాపూరీలు: ఇది టీ టైం అల్పహారంగా చెప్పొచ్చు. ఇది మంగళూరు వంటకం. మనం ఎప్పటిలా చేసే పూరీలకు విభిన్నంగా మంచి రుచిని అందిస్తాయి ఈ బనానా పూరీలు. గోధుమ పిండిలో వేడి పాలు, పండిన అరటిపండ్లు, సుగంధద్రవ్యాలు కలిపి పూరీల మాదిరిగా చేస్తే వెరైటీ వంటకాన్నీ ఆస్వాదించడమే గాకుండా పండిన అరటిపళ్లను పడేయకుండా చక్కగా ఉపయోగించగలుగుతాం. ఈ వంటకం అన్ని వయసుల వారికి తప్పక నచ్చుతుంది. 

అరటిపండు రైతా!
ఏంటిదీ అరటిపండు రైతా అని భయపడకండి. అదేనండి సలాడ్‌ మాదిరిగానే ఈ పండిన అరటిపండ్లను చక్కగా పెరుగులో కలిపి, కొద్దిపాటి డ్రైప్రూట్స్‌ జోడించి చిన్న చిన్న బౌల్‌లో వేసి అందిస్తే వావ్‌ అంటూ లాగించేస్తారు. ఇది మార్నిగ్‌ టైంలో మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీనిలో కాల్షియం, ఫైబర్‌, పోటాషియం తదితర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పైగా పిల్లలకు మంచి బలం కూడా. 

బనానా వడలు! 
ఇది కూడా టీ టైం స్నాక్స్‌ లాంటివే. అరటికాయ బజ్జీలు విన్నాం కానీ ఇలా అరటిపండ్లతో వడలేంటి అని ఆశ్చర్యపోకండి. పండిన అరటి పండ్లను వడలలో ఉపయోగించడం వల్ల లోపలి తీపి భాగం వడంతటికి స్ప్రెడ్‌ అయ్యి టేస్టీగా ఉంటుంది. ఇవి క్రంచి క్రంచిగా, టేస్టీగా మంచి ఫీల్‌ని ఇచ్చే స్నేక్స్‌ అని చెప్పొచ్చు

అరటిపండు కొబ్బరి చట్నీ
అరటిపండుతో కొబ్బరి చట్నీ ఏంటండీ? అని భయపడకండి. కొబ్బరి అరటితో ఓ క్రీమ్‌లాంటి లిక్విడ్‌ వస్తుంది. దీనికి కొద్దిగా సుగంధద్రవ్యాలు జోడిస్తే మంచి వాసనతో కూడిన రుచి ఉంటుంది. దీన్ని దోసలు, ఇడ్లీలలో స్వీట్‌ చట్నీ మాదిరిగా వాడొచ్చు. మన భాషలో చెప్పాలంటే అరటి పండు జామ్‌ అనుకోండి. ఎలా ఉంటుందా? అని సందేహించొద్దు. ఎందుకంటే? కమ్మటి కొబ్బరితో అరటిపళ్లలోని తీపి కలగలస్తే దాని టేస్టే వేరబ్బా!.

ఓసారి ట్రై చెయ్యండి మీకే తెలుస్తుంది. అంతేకాదండోయ్‌ మెత్తని పండిన అరటిపళ్లతో స్నేక్స్‌, బ్రేక్‌ఫాస్ట్‌ వంటివి చేయడం చాలా సులభం. పైగా వివిధర రకాలుగా రెసిపీల రూపంలో చేసిస్తే మన ఇంటిల్లపాదికి సకల పోషకాలను అందించినవారమవుతాం. ఇంకేందుకు ఆలస్యం వృధా చెయ్యకుండా ట్రై చేసి చూస్తారు కదూ!.

(చదవండి: చికూ ఫెస్టివల్‌ గురించి విన్నారా? ఆ ఫ్రూట్‌ కోసమే ఈ పండుగ!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement