
సాక్షి, నల్గొండ : జిల్లాలోని ఐటిపాముల శివారు ఎన్టీఆర్ నగర్ వద్ద నేషనల్ హైవే 65 పై ఆగి ఉన్న లారీని.. కోళ్ల లోడుతో వెళుతున్న డీసీఎం వ్యాను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్యాబిన్లో ముగ్గురు ఇరుక్కుపోయారు. క్యాబిన్‌లో చిక్కుకుపోయినవారిని క్రేన్ల సాయంతో బయటకు తీశారు. కాగా వీరిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరగడంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.