Aitipamula
-
లారీ- డీసీఎం వ్యాను ఢీ,ఒకరి మృతి
-
క్యాబిన్లో ఇరుక్కుని... నరకం...
సాక్షి, నల్గొండ : జిల్లాలోని ఐటిపాముల శివారు ఎన్టీఆర్ నగర్ వద్ద నేషనల్ హైవే 65 పై ఆగి ఉన్న లారీని.. కోళ్ల లోడుతో వెళుతున్న డీసీఎం వ్యాను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్యాబిన్లో ముగ్గురు ఇరుక్కుపోయారు. క్యాబిన్లో చిక్కుకుపోయినవారిని క్రేన్ల సాయంతో బయటకు తీశారు. కాగా వీరిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరగడంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం
-
బోల్తాపడ్డ కారు: ముగ్గురు మృతి
నల్గొండ : కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అధిక వేగంతో వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొట్టి బ్రిడ్జిపై నుంచి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్లు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు భద్రచలం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
బోల్తాపడ్డ కారు: ముగ్గురు మృతి
-
100 మంది విద్యార్థినులకు అస్వస్థత
నల్లగొండ : ఆహారం వికటించి 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అయిటిపాములలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో మంగళవారం చోటుచేసుకుంది. విద్యార్థినులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.