పెళ్లి కోసం తిప్పలు | Kotha Kurradu Movie Opening And Press Meet | Sakshi
Sakshi News home page

పెళ్లి కోసం తిప్పలు

Published Tue, Aug 30 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

పెళ్లి కోసం తిప్పలు

పెళ్లి కోసం తిప్పలు

ఓ కుర్రాడు పనీ, పాట లేకుండా తిరుగుతుంటాడు. ఓ గ్రామ సర్పంచ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుడిని కావొచ్చునని తెలుసుకుని ఆ ఊరు వెళతాడు. ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడానికి ఏం చేశాడు? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కొత్త కుర్రోడు’. శ్రీరాం, మహేందర్, ప్రియానాయుడు ప్రధాన పాత్రల్లో ఎస్.మోహన్‌రావు దర్శకత్వంలో రమేశ్ బదవత్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
 
తొలి సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమేరా స్విచాన్ చేయగా, మరో నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. సత్యారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘హీరో తన ప్రేమతో పాటు స్నేహితుడి ప్రేమను ఎలా సక్సెస్ చేశాడన్నదే కథ. విలన్‌గా చేబ్రోలు శ్రీను నటిస్తున్నాడు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సతీష్, సంగీతం: ఎలెన్ ధర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. రాజా నాయుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement