Kotha Kurradu
-
కొత్త కుర్రోడు వస్తున్నాడు
శ్రీరామ్, శ్రీప్రియ జంటగా రాజా నాయుడు. ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కుర్రోడు’. లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్) నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. లచ్చన్న దొర మాట్లాడుతూ– ‘‘రాజా నాయుడుగారు సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం చక్కగా తీశారు. సినిమా బాగా వచ్చింది. సాయి ఎలెందర్ సంగీతం అందించిన మా సినిమా పాటలు ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే సినిమాను అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం. ఎన్నో అడ్డంకులు వచ్చినా లక్ష్మణ్‌గారు మాకు అండగా నిలబడి సినిమా పూర్తి చేయించారు. మా అమ్మాయి శ్రీప్రియను ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం చేస్తున్నా’’ అన్నారు రాజా నాయుడు. శ్రీరామ్, శ్రీప్రియ మాట్లాడారు. ఈ చిత్రానికి నిర్వహణ: అబ్బూరి నాగేంద్ర చౌదరి, కెమెరా: సతీశ్ ముదిరాజ్. -
పెళ్లి కోసం తిప్పలు
ఓ కుర్రాడు పనీ, పాట లేకుండా తిరుగుతుంటాడు. ఓ గ్రామ సర్పంచ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుడిని కావొచ్చునని తెలుసుకుని ఆ ఊరు వెళతాడు. ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడానికి ఏం చేశాడు? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కొత్త కుర్రోడు’. శ్రీరాం, మహేందర్, ప్రియానాయుడు ప్రధాన పాత్రల్లో ఎస్.మోహన్‌రావు దర్శకత్వంలో రమేశ్ బదవత్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమేరా స్విచాన్ చేయగా, మరో నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. సత్యారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘హీరో తన ప్రేమతో పాటు స్నేహితుడి ప్రేమను ఎలా సక్సెస్ చేశాడన్నదే కథ. విలన్‌గా చేబ్రోలు శ్రీను నటిస్తున్నాడు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సతీష్, సంగీతం: ఎలెన్ ధర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. రాజా నాయుడు.