
వ్యక్తిగానే ఇష్టపడ్డా!
శ్రీరామ్‌ను తొలిసారి కలిసినప్పుడు ఎవరనే విషయం గురించి ఆలోచించలేదని, వ్యక్తిగానే ఇష్టపడి పెళ్లాడానని చెప్పింది బాలీవుడ్ సుందరి మాధురి దీక్షిత్.
న్యూఢిల్లీ: శ్రీరామ్‌ను తొలిసారి కలిసినప్పుడు ఎవరనే విషయం గురించి ఆలోచించలేదని, వ్యక్తిగానే ఇష్టపడి పెళ్లాడానని చెప్పింది బాలీవుడ్ సుందరి మాధురి దీక్షిత్. సెలబ్రిటీని కాని వ్యక్తిని వివాహం చేసుకోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మాధురి ఇలా సమాధానమిచ్చింది. కుటుంబానికే తాను తొలి ప్రాధాన్యతనిస్తానని, అందువల్లనే సినిమాలకు సంబంధించిన కమిట్‌మెంట్లు ఎప్పటికీ కుటుంబం వెనుకే ఉంటాయంది. దర్శక నిర్మాత విశాల్ భరద్వాజ్ తీస్తున్న దేడ్ ఇష్కియాలో కనిపించనున్న ఈ సుందరి ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన తారల్లో మొదటిస్థానంలో నిలిచింది. 1999లో శ్రీరాంను వివాహమాడిన తరువాత మాధురి అమెరికా వెళ్లిపోయింది. తిరిగి 2011 లో నగరానికొచ్చింది. ‘ఇక్కడ ఉండడానికే నేను ఇష్టపడతాను. నగరంలోనే నేను పెరిగాను. తిరిగి ఇక్కడికి రావడమే నాకిష్టం.
ప్రతి విషయంలోనూ నేను కొన్ని కలలుగన్నా ను’ అని శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో తెలి పింది. ‘అన్నింటికంటే కుటుం బమే నాకు ముఖ్యం. నా పిల్లలతో కలసి వారి పాఠశాలలో ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తే నేను దానికే ప్రాధాన్యమిస్తా. దానికి అనుగుణంగానే ఆ రోజు నిర్వహించాల్సిన ఇతర పనులకు ప్రణాళిక రూపొందిస్తా. కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి ఒక్క రూ ప్రణాళికలను రూపొందిం చుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొంది. మన దేశంలో ఉండడానికే తన భర్తతోపాటు పిల్లలు కూడా ప్రాధాన్యమిస్తారంది. ఉద్యానవనాలంటే తన కు ఇష్టమని, అమెరికాలోని డెన్వెర్‌లో అడుగడుగునా కనిపిస్తాయని ఈ 46 ఏళ్ల సుందరి తెలిపింది. తాను శ్రీరాంని తొలి సారి కలిసినపుడు ఆయన ఎవరనే విషయం గురించి ఆలోచించలేదని చెప్పింది. ఓ వ్యక్తిగా అతనిని ఇష్టపడ్డానని తెలిపింది.