
‘‘కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటిస్తోందని తెలిసి నేను ఓ సినిమా నుంచి తప్పుకున్నా’’ అని ప్రముఖ కెమెరామేన్ పీసీ శ్రీరామ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘కంగనాతో కలిసి పని చేయడం నాకు అసౌకర్యంగా అనిపించింది. ఈ విషయాన్ని చిత్రబృందానికి చెబితే వాళ్లు అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు మన మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చేయాలి. ఈ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’’ అన్నారాయన.
ఇది నిజంగా నాకు నష్టమే – కంగనా
కంగనాతో నేరుగా పీసీ శ్రీరామ్‌కు ఏ వివాదం లేకపోయినా.. ప్రతిదాన్నీ వివాదంగా మార్చే ఆమె తీరు నచ్చకే ఆయన తప్పుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే కంగనా బాలీవుడ్‌లో నెలకొన్న నెపోటిజమ్ (బంధుప్రీతి) గురించి విమర్శనాస్త్రాలు సంధించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో బాలీవుడ్‌లో వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారామె. ఇక తాను నటిస్తున్న సినిమా నుంచి పీసీ శ్రీరామ్ తప్పుకోవడం గురించి కంగనా ఓ ట్వీట్ చేశారు. ‘‘మీలాంటి లెజెండ్‌తో పని చేసే అవకాశాన్ని మిస్సయ్యాను. ఇది నిజంగా నాకు నష్టమే. మీకు నా విషయంలో ఎక్కడ అసౌకర్యంగా అనిపించిందో తెలియడంలేదు. ఏది ఏమైనా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. విష్ యు ఆల్ ది బెస్ట్’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు కంగనా రనౌత్.
Comments
Please login to add a commentAdd a comment