
ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమాను తాను తిరస్కరించినట్లు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సోషల్ మీడియాలోప్రకటించాడు. ఈ సినిమాను తిరస్కరించడానికి కాస్తా ఇబ్బంది పడ్డానని, కానీ తప్పలేదని చెప్పాడు. కేవలం కంగనా లీడ్ రోల్ చేస్తున్నందునే ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని మంగళవారం ఆయన ట్విటర్ వేదికగా స్ఫష్టం చేశాడు. అయితే శ్రీరామ్ తన ట్వీట్‌లో సినిమా పేరు వెల్లడించలేదు. ‘కంగనా రనౌత్ కథానాయకిగా నటిస్తున్న సినిమాను నేను తిరస్కరించాల్సి వచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో ఉన్నందున నేను అసౌకర్యానికి గురయ్యాను. నా వైఖరిని దర్శక-నిర్మాతులకు వివరించాను. వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్న’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
(చదవండి: మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగనా సవాల్)
Had to reject a film as it had Kangana Ranaut as the lead .Deep down i felt uneasy and explained my stand to the makers and they were understanding. Some times its only abt what feels right . Wishing them all the best.
— pcsreeramISC (@pcsreeram) September 8, 2020
అయితే కొన్ని సార్లు మన భావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ముఖ్యంమని, అదే సరైనదని శ్రీరామ్ తెలిపాడు. అదే విధంగా చిత్ర యూనిట్‌కు శుభకాంక్షలు కూడా తెలిపాడు. అయితే కంగనా ఇటీవల ముంబైకి, మహరాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరస వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన కొంతమంది నెటిజన్లు, అభిమానులు ఆయన నిజాయితికి ప్రశంల జల్లు కురిపిస్తుంటే.. కంగనా అభిమానులు మాత్రం ఇది వృత్తిపరమైన నిర్ణయంగా పేర్కొన్నారు. (చదవండి: కంగనా నివాసానికి ఐబీ, పోలీసు అధికారులు)
Comments
Please login to add a commentAdd a comment