
‘అల్లరి’ నరేశ్, శ్రీరామ్
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’. జి. సందీప్ దర్శకత్వంలో శ్రీ భరత్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం పోస్టర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సందీప్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
జి. సందీప్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘నరేశ్‌గారు క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలు ఎన్నో చేశారు. మా టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు శ్రీరామ్ నిమ్మల. ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: బీవీ నవీన్.
Comments
Please login to add a commentAdd a comment