Maunika
-
ఫీజు చెల్లించలేక కూలి పనికి..
మిర్యాలగూడ: ఉన్నత చదువు చదవాలన్నది ఆ గిరిజన బిడ్డ తపన.. కానీ, ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో కూలి పనులకు వెళ్తూ కష్టపడుతోంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంక్ తండాకు నూనావత్ లింగా, శాంతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు మౌనిక, చిన్న కూతురు కల్యాణి. మౌనిక మూడేళ్ల వయసులో తల్లి మరణించగా.. తండ్రి మరో పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకున్నాడు. అప్పటి నుంచి మౌనిక, కల్యాణిల బాగోగులు అమ్మమ్మ, మామయ్యలు చూసుకుంటున్నారు. చదువు కోసం మౌనికను నల్లగొండ చారుమతి అనాథాశ్రమంలో చేర్పించగా.. ఇంటర్ బైపీసీలో 9.9 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఈ తరువాత శ్యామల నాగసేనారెడ్డి అనే వ్యక్తి ప్రోత్సాహంతో ఈఏపీ సెట్, నీట్ పరీక్షలు రాసి మంచి ర్యాంకు తెచ్చుకుంది. మహబూబాబాద్ జిల్లా మాల్యాలలోని హార్టీకల్చర్ కళాశాలలో కన్వీనర్ కోటాలో మౌనికకు సీటు వచ్చింది. మౌనిక చదువుకు అమ్మమ్మ బాణావత్ లచ్చి, మేనమామ శ్రీను కొంత సాయం చేస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో ఫీజు చెల్లించే స్థోమత వారికి లేదు. తన చదువుకు అవసరమైన ఫీజు చెల్లించేందుకు దాతలు చేయూతనివ్వాలని మౌనిక వేడుకుంటోంది. -
అనుకున్నవన్నీ జరగవు
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’. జి. సందీప్ దర్శకత్వంలో శ్రీ భరత్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం పోస్టర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సందీప్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. జి. సందీప్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘నరేశ్‌గారు క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలు ఎన్నో చేశారు. మా టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు శ్రీరామ్ నిమ్మల. ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: బీవీ నవీన్. -
Youth Parliament: అయామ్ మౌనిక
యూత్పార్లమెంటులో ప్రసంగించిన మన గిరిపుత్రిక పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.. అయామ్ మౌనిక... ఫ్రం తెలంగాణ.. అని పరిచయం చేసుకుని వాజ్‌పేయి జీవితంపై అద్భుత ప్రసంగం చేసి సర్వత్రా ప్రశంసలు అందుకున్న మౌనిక గురించి... దివంగత ప్రధాని వాజ్‌పేయి జీవితంపై యూత్‌పార్లమెంట్ కార్యక్రమంలో ప్రసగించడానికి దేశ వ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా, వారిలో ఏడుగురికి భారత పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రసంగించే అవకాశం దొరికింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేతావత్ మౌనిక ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అంతేకాదు, ఈ ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని, తన అద్భుతమైన ప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకుంది మౌనిక. చురుకైన ప్రసంగాలు... రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సొంత గ్రామమైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారంకు చెందిన కేతావత్ నర్సింలు, సునీతల కుమార్తె మౌనిక. కామారెడ్డి పట్టణంలోని ఆర్కే పీజీ కాలేజీలో ఎంఎస్‌డబ్లు్య చదువుతోంది. తండ్రి నర్సింలు డీసీఎం డ్రైవర్‌గా, తల్లి సునీత బీడీ కార్మికురాలిగా కామారెడ్డి పట్టణంలో ఉండి తమ ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నారు. మౌనిక ఆర్కే కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, అదే కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు చురుకైన ప్రసంగాలతో కాలేజీలో అందరి మన్ననలను అందుకున్న మౌనికను కాలేజీ సీఈవో ఎం.జైపాల్‌రెడ్డి ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా యూత్ పార్లమెంటుకు కళాశాల విద్యార్థులను ఎంపిక చేయడానికి కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పోటీలు నిర్వహించారు. అన్నింటా మౌనిక ప్రథమ స్థానంలో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు చెందిన యూత్పార్లమెంటుకు ఎన్నికైన యువతులతో మౌనిక యూత్ పార్లమెంటు కోసం.. దేశవ్యాప్తంగా యూత్పార్లమెంటు ఎంపిక కోసం వివిధ దశల్లో వర్చువల్ పద్ధతిలో ప్రసంగ పోటీలు నిర్వహించారు. మౌనికతోపాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ నుంచి ఏడుగురికి అవకాశం కల్గింది. అందులో మౌనిక మూడోస్థానంలో మాట్లాడే అవకాశం వచ్చింది. మొదట కళాశాల స్థాయిలో పోటీలు నిర్వహించగా ‘మేకిన్ ఇండియా– మేడిన్ ఇండియా’ అంశాన్ని తీసుకుని ఉపన్యసించి ప్రథమ స్థానంలో నిలిచింది. తరువాత జిల్లా స్థాయి పోటీల్లో ‘స్టార్టప్ ఇండియా– స్టాండప్ ఇండియా’ అనే అంశంపై ప్రసంగించి ప్రథమ స్థానం సాధించింది. ఆ తరువాత రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించింది. తద్వారా పార్లమెంటులో మాట్లాడే అవకాశం లభించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.... యూత్ పార్లమెంటులో భాగంగా ఈ నెల 25న పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కేతావత్ మౌనిక మాట్లాడాలని నిర్వహకులు కోరారు. దీంతో ‘ఐ యామ్ మౌనిక ఫ్రం తెలంగాణ’ అంటూ ఇంగ్లీషులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది. దివంగత ప్రధాని వాజ్‌పేయి గురించి మౌనిక చేసిన ప్రసంగానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిపెరిగిన మౌనిక తల్లిదండ్రులు తమ చదువుల కోసం పడుతున్న శ్రమను చూసి కష్టపడి చదువుతూనే ప్రతిభకు కూడా పదును పెట్టుకుంటోంది. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయిలో నిలవాలన్న లక్ష్యంతో మౌనిక మామూలు చదువుతో పాటు ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ప్రసంగాలు చేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకుంది. యూత్ పార్లమెంటుకు ఎంపికై, తన అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్న మౌనికను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కళాశాల అధ్యాపకులు అభినందించారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి. -
Ifrah Fatima, Mounika Wadiwala: ఇద్దరు వందయ్యారు
డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా, ఉస్మానియా హాస్పిటల్లో ఎంబీబీఎస్ చేసింది. ఆమె స్నేహితురాలు డాక్టర్ మౌనిక వడియాల. తను కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉంది. అప్పుడొచ్చింది కరోనా. ప్రపంచం మొత్తం భయవిహ్వలమై పోయింది. ఒంట్లో ఏ రకమైన నలత వచ్చినా ‘ఇది కరోనా లక్షణమేమో’ లని బెంబేలు పడిపోతున్నారు జనం. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఉధృతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్ల క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు కిటకిటలాడిపోతున్నాయి. డాక్టర్ అపాయింట్మెంట్ దొరక్క ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్‌కు పరుగులు తీస్తున్నారు పేషెంట్లు. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్లకు నర్సింగ్ స్టాఫ్‌తో సర్వీస్ ఇప్పిస్తే పేషెంట్లకు సంతృప్తి ఉండడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే డాక్టర్లకు ప్రజలకు మధ్య పెద్ద దూరం పెరుగుతుందనిపించింది. ఆ దూరాన్ని తగ్గించడానికి ఒక వారధిగా పనిచేయాలనుకున్నారు. ఈ యువ డాక్టర్లిద్దరికీ అప్పుడు వచ్చిందో ఆలోచన. వెంటనే ఆన్లైన్ వైద్యానికి శ్రీకారం చుట్టారు. ఈ వైద్యానికి ఫీజు లేదు! ఇఫ్రాహ్, మౌనికలు తమ ఆలోచనను స్నేహితులందరికీ చెప్పారు. విన్నవాళ్లలో దాదాపుగా అందరూ కరోనా పేషెంట్లకు ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకు వచ్చారు. మొదటగా ఏప్రిల్ నెలలో 24 మంది డాక్టర్లతో ఒక బృందం తయారైంది. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు సమయాన్ని ఒక్కొక్క స్లాట్ రెండు గంటల చొప్పున ఆరు స్లాట్లుగా విభజించుకున్నారు. ప్రతి టైమ్ స్లాట్‌లో నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉండేటట్లు చూసుకున్నారు. డాక్టర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఏ సమయంలో ఏ డాక్టర్లను సంప్రదించాలి... వంటి వివరాలతో ఒక పట్టిక తయారు చేశారు. ఈ పట్టికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. రెండు గంటల స్లాట్‌లో యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ మాట్లాడేటంతటి రష్. డాక్టర్లు ఇచ్చిన సర్వీస్ చాలా సులువైనదే. అయితే హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ దొరకని క్లిష్టమైన సమయంలో వీరి సేవ పేషెంట్లను సేదదీర్చే చల్లని చిరుజల్లయింది. పేషెంట్లు చెప్పిన లక్షణాల ఆధారంగా కరోనా తీవ్రతను గ్రహించి అవసరమైన మందులను, ఆహారాన్ని సూచించేవారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పేవారు. తేలికపాటి లక్షణాలకు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని, హోమ్ క్వారంటైన్ పాటించమని ధైర్యం చెప్పేవారు. అలాగే ఎలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను స్వయంగా సంప్రదించాల్సి ఉంటుందో కూడా వివరించారు. ఈ సర్వీస్‌లో కొంతమంది డాక్టర్లు ఫోన్లో మాట్లాడితే మరికొంతమంది వాట్సప్ చాట్ ద్వారా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. వందమందికి చేరింది! ఇఫ్రాహ్, మౌనిక ప్రారంభించిన ఫ్రీ మెడికల్ సర్వీస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీళ్ల పోస్టులను ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, బాలీవుడ్ నటి కొంకణాసేన్‌లు కూడా షేర్ చేశారు. దేశం నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. దాంతో డాక్టర్ల సంఖ్యను 24 నుంచి యాభైకి, మే ఒకటి నాటికి యాభై నుంచి వందమందికి పెంచుకున్నారు. ఒక్కో స్లాట్‌లో ఎనిమిది నుంచి పది మంది డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. మొత్తంగా ఈ మెడికల్ సర్వీస్ నెట్‌వర్క్‌లో దేశవిదేశాల్లో ఉన్న డాక్టర్ మిత్రులందరినీ భాగస్వాములను చేయగలిగారు ఇఫ్రాహ్, మౌనిక. అలాగే సర్వీస్ టైమ్ కూడా ఉదయం ఎనిమిది నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు విస్తరించారు. రాను రాను కరోనా భయం శారీరకం నుంచి మానసిక సమస్యలకు దారి తీయడాన్ని గమనించి... హైదరాబాద్, ఎర్రగడ్డ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డాక్టర్లు కూడా ఈ మెడికల్ సర్వీస్‌లో పాలుపంచుకున్నారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల కోసం యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్‌లో ఉంటున్న వాళ్లు కూడా ఫోన్ చేస్తున్నారు. డాక్టర్ ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే! నిజంగా అవసరమైన టెస్టులేవో, అవసరం లేని టెస్టులేవో పేషెంట్లకు తెలియదు. కార్పొరేట్ హాస్పిటల్ సిబ్బంది ఒక లిస్ట్ ఇచ్చి ‘ఈ పరీక్షలు చేయించుకుని రండి’ అని మాత్రమే చెప్తారు. మరోమాట మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఒక తుమ్ము వచ్చినా, చిన్నపాటి దగ్గు వచ్చినా, ఒళ్లు వెచ్చబడినా భయంతో వణికిపోవాల్సిన దుస్థితి రాజ్యమేలుతున్న సమయంలో, డాక్టర్ల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న తరుణంలో ఈ యువ డాక్టర్లు చేస్తున్న మంచిపని వైద్యరంగం మీద గౌరవాన్ని పెంచుతోంది. ఒక్కొక్కరికి రెండు వేల ఫోన్ కాల్స్! మాకు రెండు గంటల స్లాట్‌లో యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ వచ్చేవి. ఈ యాభై రోజుల్లో మా టీమ్ డాక్టర్లు సరాసరిన ఒక్కొక్కరు రెండు వేల మందికి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటారు. మా ప్రయత్నంలో ప్రధానమైన ఉద్దేశం మా తోటి వైద్యుల మీద పెరుగుతున్న ఒత్తిడి తగ్గించడానికి మా వంతు సహకారం అందించడం. పేషెంట్లతో అనునయంగా మాట్లాడి, ‘ఏం ఫర్వాలేదు, ఈ రోగాన్ని జయించగలం’ అనే ధైర్యాన్ని కల్పించడం. అదేవిధంగా అవసరం ఉన్నా లేకపోయినా హాస్పిటల్‌కు వెళ్లడాన్ని నివారించడం కూడా. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్లు హాస్పిటల్‌కు వెళ్తే అక్కడ తీవ్ర లక్షణాలున్న పేషెంట్లతో మెలగడం ద్వారా వీరిలో కూడా వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదం ఎక్కువ. అలాంటి అనర్థాలను నివారించడానికి మా వంతుగా కృషి చేశాం. ఈ ప్రయత్నంలో కలిసి వచ్చిన డాక్టర్లందరూ తొలిరోజు నుంచి ఇప్పటి వరకు అదే అంకితభావంతో పని చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞత లు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో మాకు ఫోన్ కాల్స్ కూడా బాగా తగ్గాయి. – డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా, డాక్టర్ మౌనిక వడియాల – వాకా మంజులారెడ్డి -
జగమెరిగిన చిన్నారులు
వీక్షిత, మౌనికాశ్రీ అక్కాచెల్లెళ్లు. వీక్షిత ఆరో తరగతి, మౌనిక రెండో తరగతి చదువుతున్నారు. ఇప్పటికే వీళ్లు జ్ఞాపకశక్తిలో అనేక రికార్డులు, అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీక్షిత ఇప్పటివరకు 48 రికార్డులు, 35 అవార్డులు అందుకుంది. మౌనికాశ్రీ 22 రికార్డులతోపాటు 15 పురస్కారాలను కైవసం చేసుకుంది. వీక్షిత ఈ వయసుకే ఇంటర్మీడియట్ గణిత సూత్రాలు (220), రసాయన శాస్త్ర ఆవర్తన పట్టికలోని మూలకాల పేర్లు, వాటి సంఖ్యలు, ఫార్ములాలు (200), రామాయణ. మహాభారతాలలోని పర్వాల పేర్లు, అబ్రివేషన్స్ (100), శాస్త్రవేత్తలు–వాళ్లు కనిపెట్టిన యంత్రాలు, డ్యామ్‌లు, ప్రాజెక్టులు, త్రికోణమితి, ఆల్జీబ్రా, ఘాతాలు, ఘాతాంకాలు, వర్ణాలు, ఘనాలు, భగవద్గీత శ్లోకాలు, తెలుగు సంవత్సరాల పేర్లు (60) తదితరాలను కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే చెప్పేస్తుంది. దీంతోపాటు అబాకస్, స్పెల్–బీ, కుంగ్ఫూలలోనూ ప్రతిభ కనబరుస్తోంది. మౌనికాశ్రీ కూడా అక్క అడుగుజాడల్లోనే.. జ్ఞాపకశక్తికి ప్రతీక అయింది. మెడికల్ టెర్మినాలజీ, రాష్ట్రాలు, నాట్యాలు, శాస్త్రవేత్తల పేర్లు, దేశాలు–వాటి రాజధానులు, ఆయా దేశాల జాతీయ క్రీడలు, రైల్వే జోన్ల పేర్లు, అమెరికాలోని రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లు, భారతదేశానికి సంబంధించిన అనేక రకాల అంశాలు, గణిత శాస్త్రజ్ఞులు, వారు కనుగొన్న సూత్రాలు, పాఠ్యాంశాలు, సంఖ్యలు, పద్యాలు తదితరాలను ఐదు నిమిషాల 26 సెకండ్ల వ్యవధిలో చెప్పేస్తుంది. వీరిరువురూ జ్ఞాపకశక్తి పోటీలలో రాణిస్తుండటంతో వీరు చదువుతున్న ‘అక్షర’ పాఠశాల యాజమాన్యం వీరికి ఉచితంగా విద్యాబోధన చేస్తోంది. హైదరాబాద్‌లోని చింతల్లో నివసిస్తున్న బోడేపూడి రామారావు, నాగస్వప్న దంపతుల కుమార్తెలు ఈ ఆణిముత్యాలు. – కొల్లూరి. సత్యనారాయణ, సాక్షి, స్కూల్ ఎడిషన్ -
మార్కులు తగ్గాయని విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: మార్కులు తక్కువగా వచ్చాయి, ఇక ఉద్యోగం రావడం కష్టమని భావించిన ఓ బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. హయత్‌నగర్ డివిజన్లోని ఆంధ్రాబ్యాంక్ కాలనీలో నివసించే ఏనెపల్లి శ్రీమన్నారాయణ కుమార్తె మౌనిక (24) అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. క్రితం జరిగిన పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చాయని తరచుగా బాధపడేది. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యధార్థ సంఘటన ఆధారంగా..
‘మిస్టర్ ఆంధ్ర’ బల్వాన్, మౌనిక జంటగా వీవీవీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హైటెక్ కిల్లర్’. సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మజ్ను సోహ్రబ్ నిర్మించారు. ఎమ్. భాగ్యలక్ష్మీ సహనిర్మాత. ఎస్.కె. మజ్ను సంగీత దర్శకుడు. మజ్ను సోహ్రాబ్ మాట్లాడుతూ– ‘‘ప్యాచ్ వర్క్ మినహా సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఎస్కే మజ్ను సంగీతం బాగుంది. ఈ చిత్రంలోని రెయిన్ సాంగ్ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. దసరాకు ఆడియోను, డిసెంబర్లో సినిమాను రిలీజ్ చేయాలనకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల కాలంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా కొన్ని కల్పిత పాత్రలతో చిత్రీకరించాం’’ అన్నారు ఎమ్. భాగ్యలక్ష్మీ. సత్యప్రకాశ్, చందు, గౌతమ్‌రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి. -
పెళ్లి ఇష్టం లేదని..
ఉపాధ్యాయురాలి బలవన్మరణం మోర్తాడ్ (బాల్కొండ): పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మోర్తాడ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై అశోక్‌రెడ్డి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా అడవిరాజు పాలెం గ్రామానికి చెందిన దంపతులు ఉపాధి కోసం మోర్తాడ్‌కు వలస వచ్చారు. ఇక్కడే ఉంటూ జ్యూస్ స్టాల్ నడుపుతున్నారు. వారి కూతురు మద్దసాని మౌనిక (27) ప్రకాశం జిల్లాలోని యంత్రవల్లి గ్రామం పుల్ల చెరువు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వేసవి సెలువులు కావడంతో ఆమె మోర్తాడ్‌లో ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అయితే, కూతురికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు, బంధువులు సంబంధాలు వెతుకున్నారు. తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనను ఎవరికో కట్టబెట్టాలని యత్నిస్తున్నారని కుమిలిపోయిన మౌనిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఎంతసేపు తలుపు తట్టినా తీయకపోవడంతో వారు స్థానికులకు సమాచారమిచ్చా రు. చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా మౌనిక వేలాడుతూ కనిపించింది. విగత జీవిగా మారిన కూతుర్ని చూసి కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. -
వినోదం గ్యారెంటీ
‘హోప్’, ‘చంద్రహాస్’, ‘వెన్నెల’ వంటి చిత్రాలను నిర్మించి, నటించిన పొలిచర్ల హరనాథ్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఓ సినిమాలో నటిస్తున్నారు. ‘టిక్ టాక్’ పేరుతో ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారాయన. ఈ సినిమా డిజిటల్ పోస్టర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. హరనాథ్ మాట్లాడుతూ– ‘‘నేనిప్పటివరకు తీసిన సినిమాలకు భిన్నంగా ఉండాలని కామెడీ హారర్ నేపథ్యంలో ‘టిక్ టాక్’ తీస్తున్నా. ఇదొక పక్కా ఎంటర్టైన్మెంట్ చిత్రం. అశ్లీలం ఉండదు, చిన్నపిల్లలను భయపెట్టే హారర్ కాదు. నాకు సినిమాలు ఆత్మతో సమానం. అందుకు తగ్గట్లుగానే జీవిస్తున్నాను. ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్లు నేర్చుకున్నా. ఈ చిత్రం తర్వాత వచ్చే రెండేళ్లలో ఐదు సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. ఆస్కార్ స్థాయి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. నిషిగంధ, మౌనిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.వంశీకృష్ణ, సంగీతం: ఎస్ఆండ్బీ మ్యూజిక్ మిల్. -
ప్రేమను చంపుకోలేక..
► తిరుపతి హోటల్ గదిలో ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య ► అబ్బాయిది వరంగల్, అమ్మాయిది ప.గో ► కలిసి బతకడం కష్టమనే నిర్ణయంతో బలవన్మరణం ఇదో విచిత్ర బంధం. పెద్దలు కలిపిన బంధం కాదు. వారికి వారే పెనవేసుకున్న అనురాగ బంధం. ప్రాంతాలు.. కులాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటయ్యాయి. దీంతో ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడ్డారు. కలిసి జీవించాలని కలలు కన్నారు. కానీ... అప్పటికే వివాహితులైన ఆ ఇద్దరూ సమాజానికి భయపడ్డారు. ఇదేమని ఎవరైనా అడిగితే ఏం బదులు చెప్పాలో తెలియక కలవరపడ్డారు. కలిసి బతకలేమన్న భీతితో చివరకు తనువు చాలించారు. చనిపోయేప్పుడు ఎలా ఉంటుందో తెలియదు గానీ... ప్రాణంగా ప్రేమించిన వాళ్లు పరాయి వాళ్లుగా మారుతుంటే మాత్రం ప్రాణం పోయినట్లుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయమే వారిని మృత్యువుకు చేరువ చేసింది. వీడలేని బంధం మాదంటూ ఒకేసారి విగతజీవులయ్యారు. ఈ సంఘటన శుక్రవారం తిరుపతిలో వెలుగు చూసింది. తిరుపతి / తిరుపతి క్రైం : తిరుపతిలో ఓ ప్రేమజంట గురువా రం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం బెజవాడవారి పల్లెకి చెందిన దేవల పాపారావు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె మౌనికకు మూడునెలల కిందటే దగ్గర బంధువుతో పెళ్లైంది. ఈ పెళ్లికి ముందు మౌనికకు రంజిత్‌తో పరిచయం ఉంది. వరంగల్ జిల్లా మోదుగులగూడెం మండలం పానరసకి చెందిన తేజావత్ రంజిత్ కుమార్ (31) వరంగల్ ఫారెస్టు డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల కిందటే వివాహమై ఓ కుమార్తెను కలిగిన రంజిత్ భార్య చనిపోయింది. కాగా అడపాదడపా ఆచం ట నుంచి బంధువులున్న వరంగల్‌కు రాకపోకలు సాగించే క్రమంలో మౌనికకు రంజిత్‌తో పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. అయితే అప్పటికే వివాహమై కుమార్తెను కలిగి ఉన్న రంజిత్‌తో వివాహం కష్టమని నిర్ణయించుకున్న మౌనిక తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక పెద్దలు చేసిన పెళ్లికి తలొంచింది. అయితే మనసులోని రంజిత్‌ను మాత్రం మర్చిపోలేకపోయింది. జనవరి 22న ఇంటి నుంచి పారిపోయింది. అదే నెల 29వతేదీ వరకు ఆమె భర్త, తల్లిదండ్రులు గాలించినా కనబడకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు ఆచంట పోలీసులు మిస్సింగ్ కేసు నమో దు చేశారు. అనంతరం వీరిరువురూ ఈనెల 13న తిరుపతికి చేరుకుని ఆర్టీసి బస్టాండు ఎదురుగా ఉన్న ఓ ప్రముఖ హోటల్లో భార్యాభర్తలమని చెప్పి గదిని అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి తిరుమల, తిరుపతిలోని దేవాలయాలను సందర్శించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రూమ్‌ను శుభ్రపరిచేందుకు రూమ్‌బాయ్ కాలింగ్ బెల్ వేశాడు. ఎంతసేపటికీ డోర్ తీయక పోవడంతో హోటల్ మేనేజర్‌కు సమాచారం అందించగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈస్టు సీఐ రాంకిషోర్, ఎస్ఐ ఘటనా స్థలం చేరుకుని గది డోర్‌ను పగులకొట్టి లోపలకు వెళ్లి చూడగా వీరిద్దరు ఒకే ఫ్యాన్‌కు ఒకరు వైరుతో, మరొకరు చున్నీతో ఉరివేసుకున్నారు. సెల్‌ఫోన్ ఆధారంగా ఇరువురి ఆచూకీ తెలుసుకుని పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
వరకట్నం వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ సంఘటన సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నెహ్రూనగర్‌కు చెందిన మౌనిక(27)ను ఏడాదిన్నర కిందట హూజూరాబాద్‌కు చెందిన భరత్‌తో పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ.11 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత తరచూ అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తుండటంతో మరో రూ.2 లక్షలు ఇచ్చారు. కట్నం విషయంలో ఈ మధ్య మళ్లీ గొడవలు అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దసరా సెలవులకు పుట్టినింటికి వచ్చిన మౌనిక మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్తత రపు వారు డిమాండ్ చేయడంతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే కాన్పులో నలుగురు శిశువులు
- పురిట్లోనే మృతి హనుమాన్‌జంక్షన్ రూరల్ ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం దూడ్లవారి గూడెంకు చెందిన చిన్నం శంకరరావు భార్య మౌనిక పురిటినొప్పులతో హనుమాన్‌జంక్షన్‌లోని సీతామహాలక్ష్మీ నర్సింగ్ హోమ్‌లో చేరింది. మంగళవారం డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్లనే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఏకంగా నలుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. ఆరోనెలలోనే నొప్పులు రావటం, బిడ్డలను ప్రసవించటంతో బిడ్డలు పురిట్లోనే ప్రాణాలు విడిచారు. ఓకే కాన్పులో నలుగురు ప్రసవించటం అరుదైన విషయమని, ఇప్పటి వరకు తాను ఇలాంటి కేసు చూడలేదని డాక్టర్ దుట్టా చెప్పారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన రాపర్తి రవి(37) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రవికి రెండెకరాల భూమి ఉంది. మూడేళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. వర్షాలు సరిగా లేక దిగుబడి రాలేదు. దీంతో జీవనోపాధి కోసం ఆటో కొనుగోలు చేశాడు. ఆటో సైతం సరిగా నడవక .. రోజు గడవటం కష్టమైంది. రూ.2 లక్షలు అప్పులయ్యాయి. కుటుంబపోషణ భారం కాగా, అప్పులు ఇచ్చినవారు కట్టాలని వేధిస్తుండడంతో మనస్తాపం చెంది బుధవారంఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. రవికి భార్య మౌనిక, కుమార్తె వైష్ణవి(5), కుమారుడు అభిరామ్(3) ఉన్నారు. -
భార్యపై శాడిస్టు భర్త కిరాతకం
భర్తను స్తంభానికి కట్టేసిన స్థానికులు వేధింపులు, హింసించడం కింద కేసు నమోదు అక్కిరెడ్డిపాలెం: పెళ్లై రెండు నెలలైంది. భర్తలో శాడిజం రెట్టింపైంది. భార్యను ఒంటి నిండా బ్లేడుతో ముక్కలు ముక్కలుగా కోశాడు. ఏమీ ఎరుగని వాడిలా బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర భయంతో పక్కింటి వాళ్లకు ఆమె బాధను వెళ్లగక్కడంతో విషయం బయటకు పొక్కింది. వెంటనే తిరిగి వచ్చిన భర్తను స్థానికులు ఆగ్రహంతో స్తంభానికి కట్టేశారు. 64వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీలో బుధవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి బాధితురాలు, గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. నెల్లూరు జిల్లాకు చెందిన మౌనిక, శ్రీకాకుళం జిల్లాకు చెందిన నానుపర్తి తిరుమలరావుకు రెండు నెలల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. తిరుమలరావు ఏషియన్ పెయింట్స్ కంపెనీలో సెక్యూరిటీగా పని చేస్తూ కొద్ది నెలల పాటు గుడివాడ అప్పన్నకాలనీలో నివాసం ఉండేవాడు. వివాహం అవ్వడంతో కాలనీలోని రేషన్ డిపో సమీపంలోకి ఇళ్లు మారాడు. పెళ్లైన మూడో రోజు నుంచే ఆమెకు నరకం చూపించాడు. ఈ క్రమంలో బుధవారం ఆమె ఒంటిపై బ్లేడుతో కోసి, ఏమీ ఎరుగని వాడిలా బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర బాధతో ఆమె చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పింది. ఆమె శరీరంపై కోసిన గాట్లను చూపడంతో ఆగ్రహం చెందిన వారంతా.. తిరిగి వచ్చిన తిరుమలరావును స్తంభానికి కట్టేశాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెళ్లైన దగ్గర నుంచి తన భర్త.. మాటలతో, చేతలతో నానా ఇబ్బంది పెట్టి నరకం చూపిస్తున్నాడని విలపించింది. సమాచారం తెలుసుకున్న మర్రిపాలెంలో ఉన్న ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హింసించడం, వేధింపుల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కర్నాలలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా నివాసం ఉంటున్న వడ్డేపల్లి మౌనిక (28) ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసి ప్రాణంతో ఉందన్న ఆశతో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
పెళ్లి ఇష్టం లేక ఇద్దరు యువతుల ఆత్మహత్య
అప్పల్రావుపేట, మీదికొండ గ్రామాల్లో ఘటనలు నెక్కొండ : పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్ప డ్డారు. ఎస్సై మిథున్ కథనం ప్రకారం.. నెక్కొండ మండలంలోని అప్పల్‌రావుపేటకు గ్రామానికి చెందిన పాయల వెంకన్న కుమార్తె మౌనిక(18) మండల కేంద్రంలోని శ్రీవికాస్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు గత ఆరు నెలల క్రితం ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. చదువులో ముందుండే ఆమెకు వివాహం ఇష్టం లేక, మరోవైపు తల్లిదండ్రులను బాధ పెట్టలేక మనోవేదనకు గురై గురువారం ఉదయం పత్తి చేనులో కొట్టేందుకని పురుగుల మందు కొనుగోలు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగింది. అనంతరం తన ఇంటి పక్కనేఉండే పిన్ని వద్దకువెళ్లి తాను చనిపోతున్నానని, పురుగుల మందు తాగానని చెప్పింది. వెంట నే మౌనికను ఆస్పత్రికి తరలించేందుకు బైక్‌పై నర్సం పేటకు తీసుకవెళ్తుండగా మా ర్గమధ్యలో మృతి చెందింది. మౌనిక తండ్రి ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు ఎస్సై వివరించారు. శ్రీవికాస్ కళాశాలకు సెలవు బీఎస్సీ (ఎంపీసీఎస్) సెకండియర్ చదువుతున్న మౌనిక అకాల మృతిపట్ల కళాశాల విద్యార్థులు మౌనం పాటించి నివాళులర్పించారు. కళాశాలలో టాపర్‌గా నిలిచిన మౌనిక మృతికి సంతాపంగా కళాశాలకు సెలవు ఇవ్వగా, ఆమె స్వగ్రామం అప్పల్‌రావుపేటకు కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు బయల్దేరి వెళ్లి అంత్యక్రియలకు హాజరయ్యారు. -
నిలకడగా రామన్నపేట బాధితుల ఆరోగ్యం
హైదరాబాద్: నల్లగొండ జిల్లా రామన్నపేట వద్ద బుధవారం జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి నార్కట్‌పల్లి కామినేనిలో చికిత్స పొందుతున్న మౌనిక, అక్షిత్‌లను మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మరొక వ్యక్తి గురువారం కామినేనిలో చేరారు. ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. రామన్నపేటకు చెందిన ఎదుగాని మౌనిక (20) నగరంలోని కోఠి ఉమెన్స్‌కాలేజీలో ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సెలవులు ఉండటంతో బుధవారం మౌనిక రామన్నపేటలోని ఇంటికి బయలు దేరింది. బస్సు ప్రమాదంలో మౌనిక కుడి చేయి, మెడకు తీవ్ర గాయాలయ్యాయి, మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన తోట ప్రమోద్‌కుమార్, విజయలక్ష్మి దంపతులు ఉప్పల్ బస్‌డిపో ప్రాంతంలో నివాసముంటున్నారు. విజయలక్ష్మి తోటి కోడలు రమాదేవికి బిడ్డ పుట్టడంతో పరామర్శించేందుకు తన కుమారుడు అక్షిత్ (18నెలలు)తో బయలుదేరింది. ఈ ప్రమాదంలో విజయలక్ష్మి మృతి చెందగా, అక్షిత్ ప్రాణాలతో బయటపడ్డాడు. బాబు ముఖానికి గాయాలయ్యాయని, ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. ఉప్పల్ బుద్ధానగర్‌లో నివసించే ఎస్.మహేందర్‌రెడ్డి (55) బీబీనగర్ మండలం పడమట సోమారంలో గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని నల్లగొండలోని జిల్లా కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆయనను మెరుగైన చికిత్స కోసం గురువారం ఎల్బీనగర్లో ఆసుపత్రికి తరలించారు. -
మహిళను హతమార్చి.. డబ్బాలో కుక్కి..
మెదక్ రూరల్ : ఓ వివాహితను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని డబ్బాలో కుక్కి అడవిలో పడేశారు. ఈ సంఘటన మెదక్ మండలం రాయినిపల్లి అడవిలో సోమవారం వెలుగు చూసింది. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన చెరకు దుర్గారెడ్డి, లక్ష్మి దంపతుల మూడో సంతానమైన మౌనిక (24)ను గతేడాదిన్నర క్రితం చేగుంట మండలం పోతన్పల్లికి చెందిన మహిపాల్‌రెడ్డితో వివాహం జరిపించారు. కాగా.. నెల రోజులు క్రితం మౌనిక జంగరాయికి వచ్చింది. ఆమె ఈ నెల 12న అత్తగారింటికి వెళ్లాల్సి ఉన్నా.. ఏదో ఫోన్ రావడంతో నిలిచిపోయింది. 13వ తేదీ నుంచి మౌనిక కనపడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మండలంలోని రాయినిపల్లి అడవిలో గుర్తుతెలియని యువతి మృతదేహం ఉందని సమాచారం అందడంతో పోలీసులు మౌనిక తల్లిదండ్రులను పిలిపించారు. వారు మృతదేహం చూసి తమ కుమార్తెదేనని గుర్తించినట్లు ఎస్ఐ వివరించారు. -
కట్టుకున్నోడే.. కడతేర్చాడు..
తాళి కట్టిన చేతులతోనే ఊపిరి తీసిన భర్త కరెంట్‌షాక్‌తో చనిపోరుుందని నమ్మించబోరుున నిందితుడు పెళ్లయిన తొమ్మిది నెలలకే దారుణం కేసముద్రం : కట్టుకున్నోడే ఆమె పాలిట కాలయముడయ్యూడు. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసి, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త తాళికట్టిన చేతులతోనే గొంతు నులిమి భార్యను కడతేర్చాడు. ఈ ఘటన మండలంలోని కల్వల గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై రంజిత్‌రావు తెలిపిన ప్రకారం. గ్రామానికి చెందిన చిదిరాల సంతోష్‌కు మానుకోట మండలం నడివాడకు చెందిన అతడి సొంత అక్క విజయ కూతురు మౌనిక(18)తో 9 నెలల క్రితం వివాహమైంది. సంతోష్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అతడు పెళ్లరుున నెలకే హైదరాబాద్‌కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయూడు. దీంతో మౌనిక అప్పట్లోనే పుట్టింటికి వచ్చింది. కూతురి పరిస్థితి చూడలేక ఆమె తండ్రి నాగన్న మనోవేదనకు గురయ్యూడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. బావ మరణవార్త తెలుసుకున్న సంతోష్ నడివాడ కు చేరుకున్నాడు. అక్కడ బంధువులంతా అతడిని మందలించడంతో తాను ఇక నుంచి మౌనికను మంచిగానే చూసుకుంటానని చెప్పాడు. పెద్దమనుషులు సంతోష్ పేరిట ఉన్న ఆస్తిని మౌనిక పేరున రాసివ్వాలని నిబంధన పెట్టడంతో సరేనని తనకున్న ఆస్తిని రాసిచ్చాడు. ఆ తర్వాత భార్యను కల్వల గ్రామానికి తీసుకెళ్లిన సంతోష్ అయిష్టంతోనే సంసార జీవితం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ‘నాతో సరిగ్గా ఉండడం లేదు.. నువ్వు మళ్లీ మరో మహిళతో సంబంధాన్ని సాగిస్తున్నావా’ అని మౌనిక ప్రశ్నించడంతో ఆగ్రహం చెందిన సంతోష్ ఆమె గొంతు నులుముతూ గోడకు నెట్టాడు. గొంతును గట్టిగా నులిమి హతమార్చాడు. తనపై కేసవుతుందనే భయంతో కరెంటు షాక్‌తో చనిపోయినట్లుగా ట్యూబ్‌లైట్ పగులగొట్టి, తర్వాత విద్యుత్ తీగలు వేలాడదీసి ప్రమాదంగా చిత్రించాడు. తర్వాత బయటికి వచ్చి అతడు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారంతా ఆమెను మానుకోటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అప్పటికే మృతిచెందిన విషయం తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం మృతురాలి తల్లి, సోదరుడు మునీందర్తోపాటు బంధువులు చేరుకుని సంతోష్‌ను నిలదీయగా పారిపోయూడు. ఎస్సై రంజిత్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీ లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా భార్యను గొంతు పిసికి హత్యచేసిన సంతోష్‌ను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బొమ్మనబోయిన అనసూర్య డిమాండ్ చేశారు. -
లారీ ఢీకొని బీటెక్ విద్యార్థిని దుర్మరణం
మియాపూర్: ద్విచక్రవాహనాన్ని స్టార్ట్ చేస్తే కాలేదు... దీంతో ఇంజిన్ వైపు వంగి చూస్తున్న బీటెక్ విద్యార్థినిని అంతలోనే వెనుకనుంచి దూసుకొచ్చి ఇసుక లారీ బలిగొంది. ఈ హృదయ విదారక ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కొండగట్టు గ్రామానికి చెందిన మౌనిక (18) నగరంలోని మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ ఫైనల్ చదువుతూ మియాపూర్ హెచ్ఎంసీ స్వర్ణపురికాలనీలోని పెద్దన్నాన ఇంట్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తమ ఇంటి ముందు ఉన్న రోడ్డుపై తన ద్విచక్రవాహనాన్ని నిలిపి స్టార్ట్ చేయగా స్టార్ట్ కాలేదు. దీంతో ఆమె ద్విచక్ర వాహనాన్ని వంగి పరిశీలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన మౌనికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... చికిత్సపొందుతూ రాత్రి 8.30కి మృతి చెందింది. పోలీసులు స్వగ్రామంలో ఉన్న మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు శోకసంద్రంలో మునిగిపోయారు. -
గురుకుల పాఠశాలలో బాలిక అదృశ్యం
డోన్ రూరల్: పట్టణ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి మౌనిక అదృశమైంది. ఆదివారం నుంచి తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు డోన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, రత్నస్వామి దంపతుల కుమార్తె మౌనిక స్థానిక గురుకుల పాఠశాలలో మూడేళ్ల క్రితం ఐదో తరగతిలో ప్రవేశం పొందింది. ఈమె ఆదివారం ఉదయం అల్పాహార సమయంలో కనిపించకపోవడంతో పాఠశాల సిబ్బంది బాలిక కోసం గాలించారు. ఆచూకీ లభ్యంకాకపోవడంతో మధ్యాహ్నం విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపాల్ ఉమాకుమారితో వాగ్వాదానికి దిగారు. తమ కూతురు కనిపించకపోవడానికి స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని వారు పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యమే కారణం.. స్థానిక గురుకుల పాఠశాలలో 616 మంది బాలికలు చదువుతున్నారు. పాఠశాలతో పాటు రెసిడెన్షియల్ సౌకర్యం ఉండటంతో సిబ్బంది కూడా ఇక్కడే ఉంటున్నారు. అయితే బాలికల సంరక్షణ పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థినులు తరచూ అదృశ్యమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. అయినా సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలను సందర్శించిన డీఎస్పీ, ఎస్ఐ.. స్థానిక గురుకుల పాఠశాలను సోమవారం డోన్ డీఎస్పీ పీఎన్ బాబు, ఎస్ఐ సుబ్రమణ్యం సందర్శించి విద్యార్థి అదృశ్యంపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్‌తో వారు సమావేశమై చర్చించారు. బాలికల సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి: గురుకుల పాఠశాలలో విద్యార్థిని అదృశ్యానికి కారణమైన ప్రిన్సిపాల్ ఉమాకుమారిని తక్షణమే సస్పెండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భాగ్ కన్వీనర్ విజయభాస్కర్, పట్టణ కార్యదర్శి చిరంజీవి, మండల కన్వీనర్, కోకన్వీనర్లు శివశంకర్, నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం గురుకుల పాఠశాలకు వచ్చిన డీఎస్పీ పీఎన్బాబకు ఏబీవీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. -
వినోదాత్మక సోషియో ఫాంటసీ
‘‘కథ నచ్చితేనే ఇందులో పాత్ర చేస్తానని ముందే చెప్పాను. కథ విన్నాక చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది. విభిన్నమైన, వినోదాత్మకమైన సోషియో ఫాంటసీ ఇది’’ అని తనికెళ్ల భరణి చెప్పారు. రాజీవ్ సాలూరి, మదిరాక్షి, మౌనిక హీరో హీరోయిన్లుగా శ్రీరామ్ వేగరాజు దర్శకత్వంలో ఛేజింగ్ డ్రీమ్స్ పతాకంపై రవిశంకర్.వి నిర్మిస్తున్న ‘ఓరి దేవుడోయ్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి డి.రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, డా.దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు శ్రీరామ్ వేగరాజు మాట్లాడుతూ -‘‘బాగా డబ్బు సంపాదించిన ఓ కుర్రాడు తన సమస్యలతో పాటు తన చుట్టూ ఉన్నవారి సమస్యలను ఎలా పరిష్కరించాడన్నదే ఈ చిత్రం ప్రధాన కథాంశం’’ అని చెప్పారు. సింగిల్ షెడ్యూల్లో జనవరి నాటికి చిత్రాన్ని పూర్తి చేస్తామని నిర్మాత తెలిపారు. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయని రాజీవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా నరేష్, ఎల్బీ శ్రీరామ్, మాటల రచయిత చెబియం శ్రీనివాసన్, సహనిర్మాతలు మాధురి వేగరాజు, హరీష్‌కుమార్ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రతాప్‌కుమార్, సంగీతం: కోటి.