వరకట్న వేధింపులకు వివాహిత బలి | married woman commits suicide due to Dowry harassment | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపులకు వివాహిత బలి

Published Wed, Oct 5 2016 11:41 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

married woman commits suicide due to Dowry harassment

వరకట్నం వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ సంఘటన సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నెహ్రూనగర్‌కు చెందిన మౌనిక(27)ను ఏడాదిన్నర కిందట హూజూరాబాద్‌కు చెందిన భరత్‌తో పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ.11 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత తరచూ అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తుండటంతో మరో రూ.2 లక్షలు ఇచ్చారు. కట్నం విషయంలో ఈ మధ్య మళ్లీ గొడవలు అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దసరా సెలవులకు పుట్టినింటికి వచ్చిన మౌనిక మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్తత రపు వారు డిమాండ్ చేయడంతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement