దాతల సాయానికి చదువుల తల్లి వినతి
మిర్యాలగూడ: ఉన్నత చదువు చదవాలన్నది ఆ గిరిజన బిడ్డ తపన.. కానీ, ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో కూలి పనులకు వెళ్తూ కష్టపడుతోంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంక్ తండాకు నూనావత్ లింగా, శాంతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు మౌనిక, చిన్న కూతురు కల్యాణి. మౌనిక మూడేళ్ల వయసులో తల్లి మరణించగా.. తండ్రి మరో పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకున్నాడు.
అప్పటి నుంచి మౌనిక, కల్యాణిల బాగోగులు అమ్మమ్మ, మామయ్యలు చూసుకుంటున్నారు. చదువు కోసం మౌనికను నల్లగొండ చారుమతి అనాథాశ్రమంలో చేర్పించగా.. ఇంటర్ బైపీసీలో 9.9 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఈ తరువాత శ్యామల నాగసేనారెడ్డి అనే వ్యక్తి ప్రోత్సాహంతో ఈఏపీ సెట్, నీట్ పరీక్షలు రాసి మంచి ర్యాంకు తెచ్చుకుంది.
మహబూబాబాద్ జిల్లా మాల్యాలలోని హార్టీకల్చర్ కళాశాలలో కన్వీనర్ కోటాలో మౌనికకు సీటు వచ్చింది. మౌనిక చదువుకు అమ్మమ్మ బాణావత్ లచ్చి, మేనమామ శ్రీను కొంత సాయం చేస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో ఫీజు చెల్లించే స్థోమత వారికి లేదు. తన చదువుకు అవసరమైన ఫీజు చెల్లించేందుకు దాతలు చేయూతనివ్వాలని మౌనిక వేడుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment