కట్టుకున్నోడే.. కడతేర్చాడు..
తాళి కట్టిన చేతులతోనే ఊపిరి తీసిన భర్త
కరెంట్‌షాక్‌తో చనిపోరుుందని నమ్మించబోరుున నిందితుడు
పెళ్లయిన తొమ్మిది నెలలకే దారుణం
కేసముద్రం : కట్టుకున్నోడే ఆమె పాలిట కాలయముడయ్యూడు. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసి, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త తాళికట్టిన చేతులతోనే గొంతు నులిమి భార్యను కడతేర్చాడు. ఈ ఘటన మండలంలోని కల్వల గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై రంజిత్‌రావు తెలిపిన ప్రకారం. గ్రామానికి చెందిన చిదిరాల సంతోష్‌కు మానుకోట మండలం నడివాడకు చెందిన అతడి సొంత అక్క విజయ కూతురు మౌనిక(18)తో 9 నెలల క్రితం వివాహమైంది. సంతోష్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అతడు పెళ్లరుున నెలకే హైదరాబాద్‌కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయూడు. దీంతో మౌనిక అప్పట్లోనే పుట్టింటికి వచ్చింది. కూతురి పరిస్థితి చూడలేక ఆమె తండ్రి నాగన్న మనోవేదనకు గురయ్యూడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. బావ మరణవార్త తెలుసుకున్న సంతోష్ నడివాడ కు చేరుకున్నాడు. అక్కడ బంధువులంతా అతడిని మందలించడంతో తాను ఇక నుంచి మౌనికను మంచిగానే చూసుకుంటానని చెప్పాడు.
పెద్దమనుషులు సంతోష్ పేరిట ఉన్న ఆస్తిని మౌనిక పేరున రాసివ్వాలని నిబంధన పెట్టడంతో సరేనని తనకున్న ఆస్తిని రాసిచ్చాడు. ఆ తర్వాత భార్యను కల్వల గ్రామానికి తీసుకెళ్లిన సంతోష్ అయిష్టంతోనే సంసార జీవితం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ‘నాతో సరిగ్గా ఉండడం లేదు.. నువ్వు మళ్లీ మరో మహిళతో సంబంధాన్ని సాగిస్తున్నావా’ అని మౌనిక ప్రశ్నించడంతో ఆగ్రహం చెందిన సంతోష్ ఆమె గొంతు నులుముతూ గోడకు నెట్టాడు. గొంతును గట్టిగా నులిమి హతమార్చాడు. తనపై కేసవుతుందనే భయంతో కరెంటు షాక్‌తో చనిపోయినట్లుగా ట్యూబ్‌లైట్ పగులగొట్టి, తర్వాత విద్యుత్ తీగలు వేలాడదీసి ప్రమాదంగా చిత్రించాడు. తర్వాత బయటికి వచ్చి అతడు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారంతా ఆమెను మానుకోటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అప్పటికే మృతిచెందిన విషయం తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం మృతురాలి తల్లి, సోదరుడు మునీందర్‌తోపాటు బంధువులు చేరుకుని సంతోష్‌ను నిలదీయగా పారిపోయూడు.
ఎస్సై రంజిత్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీ లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా భార్యను గొంతు పిసికి హత్యచేసిన సంతోష్‌ను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బొమ్మనబోయిన అనసూర్య డిమాండ్ చేశారు.