మెదక్ రూరల్ : ఓ వివాహితను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని డబ్బాలో కుక్కి అడవిలో పడేశారు. ఈ సంఘటన మెదక్ మండలం రాయినిపల్లి అడవిలో సోమవారం వెలుగు చూసింది. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన చెరకు దుర్గారెడ్డి, లక్ష్మి దంపతుల మూడో సంతానమైన మౌనిక (24)ను గతేడాదిన్నర క్రితం చేగుంట మండలం పోతన్‌పల్లికి చెందిన మహిపాల్‌రెడ్డితో వివాహం జరిపించారు. కాగా.. నెల రోజులు క్రితం మౌనిక జంగరాయికి వచ్చింది.
ఆమె ఈ నెల 12న అత్తగారింటికి వెళ్లాల్సి ఉన్నా.. ఏదో ఫోన్ రావడంతో నిలిచిపోయింది. 13వ తేదీ నుంచి మౌనిక కనపడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మండలంలోని రాయినిపల్లి అడవిలో గుర్తుతెలియని యువతి మృతదేహం ఉందని సమాచారం అందడంతో పోలీసులు మౌనిక తల్లిదండ్రులను పిలిపించారు. వారు మృతదేహం చూసి తమ కుమార్తెదేనని గుర్తించినట్లు ఎస్‌ఐ వివరించారు.
మహిళను హతమార్చి.. డబ్బాలో కుక్కి..
Published Tue, May 19 2015 2:53 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM