‘మిస్టర్ ఆంధ్ర’ బల్వాన్, మౌనిక జంటగా వీవీవీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హైటెక్ కిల్లర్’
‘మిస్టర్ ఆంధ్ర’ బల్వాన్, మౌనిక జంటగా వీవీవీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హైటెక్ కిల్లర్’. సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మజ్ను సోహ్రబ్ నిర్మించారు. ఎమ్. భాగ్యలక్ష్మీ సహనిర్మాత. ఎస్.కె. మజ్ను సంగీత దర్శకుడు. మజ్ను సోహ్రాబ్ మాట్లాడుతూ– ‘‘ప్యాచ్ వర్క్ మినహా సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది.
ఎస్‌కే మజ్ను సంగీతం బాగుంది. ఈ చిత్రంలోని రెయిన్ సాంగ్ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. దసరాకు ఆడియోను, డిసెంబర్‌లో సినిమాను రిలీజ్ చేయాలనకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల కాలంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా కొన్ని కల్పిత పాత్రలతో చిత్రీకరించాం’’ అన్నారు ఎమ్. భాగ్యలక్ష్మీ. సత్యప్రకాశ్, చందు, గౌతమ్‌రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి.