Balwan
-
హత్య చేసిందెవరు?
జాతీయ బాడీ బిల్డర్ బల్వాన్ హీరోగా ప్రాచి అధికారి, మౌనిక హీరోయిన్లుగా ఎస్ఎంఎం ఖాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నైజాం పిల్లోడు’. రెహాన బేగం నిర్మిస్తున్న ఈ సినిమా ఒక్కపాట మినహా పూర్తి అయింది. మార్చి 29న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎస్ఎంఎం ఖాజా మాట్లాడుతూ– ‘‘45 సినిమాల్లో సోలో ఫైటర్‌గా చేసిన బల్వాన్ ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు. ‘‘మా సినిమా ద్వారా సంగీత దర్శకుడు మజ్నుని పరిచయం చేస్తున్నాం. మా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని రెహాన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, సంగీతం: ఎస్ కే. మజ్ను. -
ప్రతి క్షణం థ్రిల్
మాజీ మిస్టర్ ఆంధ్రా బల్వాన్, శ్రావణి జంటగా తెరకెక్కిన చిత్రం ‘డిటెక్టివ్ భాస్కర్’. కృష్ణమోహన్ దర్శకత్వంలో ఎస్.ఎం. సంధాని బాషా, మజ్ను సోహ్రాబ్ నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘భారత్ బంద్’ ఫేమ్ విజయ్ శేఖర్ మా చిత్రానికి చక్కని స్వరాలు అందించారు. ఏడు రాత్రులు తీసిన వాన పాట హైలెట్‌గా నిలుస్తుంది. త్వరలో ఆడియోను, దసరాకు సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాలను వణుకు పుట్టించిన ఓ మర్డర్ మిస్టరీని ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏ విధంగా ఛేదించాడన్నది చిత్రకథాంశం. ఆద్యంతం ఉత్కంఠగా ఉంటుంది’’ అన్నారు కృష్ణమోహన్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ఎం.ఎం.ఖాజా. -
యధార్థ సంఘటన ఆధారంగా..
‘మిస్టర్ ఆంధ్ర’ బల్వాన్, మౌనిక జంటగా వీవీవీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హైటెక్ కిల్లర్’. సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మజ్ను సోహ్రబ్ నిర్మించారు. ఎమ్. భాగ్యలక్ష్మీ సహనిర్మాత. ఎస్.కె. మజ్ను సంగీత దర్శకుడు. మజ్ను సోహ్రాబ్ మాట్లాడుతూ– ‘‘ప్యాచ్ వర్క్ మినహా సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఎస్కే మజ్ను సంగీతం బాగుంది. ఈ చిత్రంలోని రెయిన్ సాంగ్ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. దసరాకు ఆడియోను, డిసెంబర్లో సినిమాను రిలీజ్ చేయాలనకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల కాలంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా కొన్ని కల్పిత పాత్రలతో చిత్రీకరించాం’’ అన్నారు ఎమ్. భాగ్యలక్ష్మీ. సత్యప్రకాశ్, చందు, గౌతమ్‌రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి.