![detective bhaskar hit by murder mystery - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/17/detective-bhaskar.jpg.webp?itok=hMNfmmDs)
బల్వాన్, శ్రావణి
మాజీ మిస్టర్ ఆంధ్రా బల్వాన్, శ్రావణి జంటగా తెరకెక్కిన చిత్రం ‘డిటెక్టివ్ భాస్కర్’. కృష్ణమోహన్ దర్శకత్వంలో ఎస్.ఎం. సంధాని బాషా, మజ్ను సోహ్రాబ్ నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘భారత్ బంద్’ ఫేమ్ విజయ్ శేఖర్ మా చిత్రానికి చక్కని స్వరాలు అందించారు. ఏడు రాత్రులు తీసిన వాన పాట హైలెట్‌గా నిలుస్తుంది. త్వరలో ఆడియోను, దసరాకు సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాలను వణుకు పుట్టించిన ఓ మర్డర్ మిస్టరీని ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏ విధంగా ఛేదించాడన్నది చిత్రకథాంశం. ఆద్యంతం ఉత్కంఠగా ఉంటుంది’’ అన్నారు కృష్ణమోహన్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ఎం.ఎం.ఖాజా.
Comments
Please login to add a commentAdd a comment