ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.
- పురిట్లోనే మృతి
హనుమాన్‌జంక్షన్ రూరల్
ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం దూడ్లవారి గూడెంకు చెందిన చిన్నం శంకరరావు భార్య మౌనిక పురిటినొప్పులతో హనుమాన్‌జంక్షన్‌లోని సీతామహాలక్ష్మీ నర్సింగ్ హోమ్‌లో చేరింది. మంగళవారం డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్లనే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఏకంగా నలుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. ఆరోనెలలోనే నొప్పులు రావటం, బిడ్డలను ప్రసవించటంతో బిడ్డలు పురిట్లోనే ప్రాణాలు విడిచారు. ఓకే కాన్పులో నలుగురు ప్రసవించటం అరుదైన విషయమని, ఇప్పటి వరకు తాను ఇలాంటి కేసు చూడలేదని డాక్టర్ దుట్టా చెప్పారు.