భార్యపై శాడిస్టు భర్త కిరాతకం | Wife, husband brutally sadistu | Sakshi
Sakshi News home page

భార్యపై శాడిస్టు భర్త కిరాతకం

Published Wed, Dec 30 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

భార్యపై శాడిస్టు భర్త కిరాతకం

భార్యపై శాడిస్టు భర్త కిరాతకం

భర్తను స్తంభానికి కట్టేసిన స్థానికులు
వేధింపులు, హింసించడం కింద కేసు నమోదు

 
అక్కిరెడ్డిపాలెం:  పెళ్లై రెండు నెలలైంది. భర్తలో శాడిజం రెట్టింపైంది. భార్యను ఒంటి నిండా బ్లేడుతో ముక్కలు ముక్కలుగా కోశాడు. ఏమీ ఎరుగని వాడిలా బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర భయంతో పక్కింటి వాళ్లకు ఆమె బాధను వెళ్లగక్కడంతో విషయం బయటకు పొక్కింది. వెంటనే తిరిగి వచ్చిన భర్తను స్థానికులు ఆగ్రహంతో స్తంభానికి కట్టేశారు. 64వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీలో బుధవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి బాధితురాలు, గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి..

నెల్లూరు జిల్లాకు చెందిన మౌనిక, శ్రీకాకుళం జిల్లాకు చెందిన నానుపర్తి తిరుమలరావుకు రెండు నెలల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. తిరుమలరావు ఏషియన్ పెయింట్స్ కంపెనీలో సెక్యూరిటీగా పని చేస్తూ కొద్ది నెలల పాటు గుడివాడ అప్పన్నకాలనీలో నివాసం ఉండేవాడు. వివాహం అవ్వడంతో కాలనీలోని రేషన్ డిపో సమీపంలోకి ఇళ్లు మారాడు. పెళ్లైన మూడో రోజు నుంచే  ఆమెకు నరకం చూపించాడు. ఈ క్రమంలో బుధవారం ఆమె ఒంటిపై బ్లేడుతో కోసి, ఏమీ ఎరుగని వాడిలా బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర బాధతో ఆమె చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పింది. ఆమె శరీరంపై కోసిన గాట్లను చూపడంతో ఆగ్రహం చెందిన వారంతా.. తిరిగి వచ్చిన తిరుమలరావును స్తంభానికి కట్టేశాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెళ్లైన దగ్గర నుంచి తన భర్త.. మాటలతో, చేతలతో నానా ఇబ్బంది పెట్టి నరకం చూపిస్తున్నాడని విలపించింది. సమాచారం తెలుసుకున్న మర్రిపాలెంలో ఉన్న ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హింసించడం, వేధింపుల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement