
ప్రేమ ఉంది. సస్పెన్స్ ఉంది. యాక్షన్ ఉంది.. అన్నీ ఉన్నాయి. అసలేం జరిగింది? అంటే ఇప్పుడు కాదు.. మేలో తెలుస్తుంది. శ్రీరాం, సంచితా పదుకునే జంటగా ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న ‘అసలేం జరిగింది’. షూటింగ్ పూర్తయింది. ‘‘దాదాపు 40 రోజులు చేసిన షూటింగ్‌లో టాకీ, పాటలు, ఫైట్లు తీశాం. ఫైట్ మాస్టర్ శంకర్ తెరకెక్కించిన భారీ ఫైట్స్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. అలాగే కొత్త కొరియోగ్రాఫర్ ఈశ్వర్, మరో కొరియోగ్రాఫర్ హరి పాటలకు అద్భుతమైన స్టెప్స్ సమకూర్చారు.
ఓ మాస్ సాంగ్‌లో దాదాపు రెండు వందల మంది, మరో పాటలో నాలుగు వందల మంది పాల్గొన్నారు. ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. 8కె రెజల్యూషన్ గల రెడ్ మాన్‌స్ట్రో కెమెరాను ఈ సినిమా చిత్రీకరణ కోసం వినియోగించాం. దర్శకుడు ఎన్‌వీఆర్ అద్భుతంగా తెరకెక్కించారు. మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment