కరు చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: నటి సాయిపల్లవి నటించిన తొలి తమిళ చిత్రమే ఆటంకాలను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. మాలీవుడ్‌లో ప్రేమమ్‌తోనూ, టాలీవుడ్‌లో ఫిదా చిత్రంతోనూ అనూహ్య క్రేజ్‌ను సంపాదించుకున్న నటి సాయిపల్లవికి కోలీవుడ్ ఎంట్రీ మాత్రం కాస్త ఆలస్యంగానే జరిగింది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు విజయ్ దర్శకత్వం వహించిన కరు చిత్రం ద్వారా సాయిపల్లవి కోలీవుడ్‌కు పరిచయం కానుంది.
టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో చిత్ర టైటిల్ వివాదంలో చిక్కుకుంది. కురు చిత్ర టైటిల్ హక్కులు తనకు చెందినవి అంటూ స్థానికి ఎంజీఆర్ నగర్‌కు చెందిన జేఎస్.స్క్రీన్ సంస్థ అధినేత మణిమారన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సాయిపల్లవి చిత్రం చిక్కుల్లో పడింది. న్యాయస్థానం ఈమె చిత్రానికి కరు టైటిల్‌ను నిషేధించింది. దీంతో లైకా సంస్థ మద్రాసు హైకోర్టులో ఈ చిత్ర టైటిల్‌పై అప్పీల్ చేసుకుంది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తుల బెంచ్ విచారణ చేపట్టింది.
ఈ విచారణకు లైకాసంస్థ తరఫు న్యాయవాది హాజరై కరు చిత్రం టైటిల్‌ను తాము ప్రకటించిన తరువాత జేఎస్.స్క్రీన్ సంస్థ అధినేత మణిమారన్ ఈ టైటిల్ తనదంటూ కోర్టును ఆశ్రయించారని, తాము కరు టైటిల్ పేరుతో ఇప్పటికే ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకున్నామని, ఇప్పుడు టైటిల్‌పై నిషేధం విధిస్తే చాలా నష్టపాతామని వాధించారు. ఇరుతరఫు వాదనలు పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తుల బెంచ్ కురు చిత్ర టైటిల్‌పై నిషేధాన్ని తొలగిస్తూ లైకా సంస్థకు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. దీంతో అడ్డంకులు తొలగడంతో సాయిపల్లవి కరు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సన్నాహాలు జరుపుకుంటోందని సమాచారం. ఇందులో సాయిపల్లవి ఒక బిడ్డకు తల్లిగా నటించిందన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment