Title contraversy
-
సుధీర్ బాబు ‘హంట్’ టైటిల్ మాది: హీరో నిక్షిత్
‘‘హంట్’ టైటిల్‌ని ముందు మేము రిజిస్టర్ చేయించాం. అయితే సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్‌పై రూపొందిన చిత్రానికి కూడా ‘హంట్’ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ మార్చుకోమన్నా వారు పట్టించుకోవడం లేదు’’ అని ‘హంట్’ హీరో, దర్శకుడు నిక్షిత్ అన్నారు. నర్సింగ్ రావు నిర్మించిన చిత్రం ‘హంట్’. నిక్షిత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. ఎమ్ఎస్ఆర్ట్స్ అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ– ‘‘శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘హంట్’టైటిల్‌ను 6 నెలల క్రితం ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేసుకున్నాం. ఇదే టైటిల్‌ని భవ్య క్రియేషన్స్ పెట్టుకుని, సినిమా విడుదల ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు’’ అన్నారు. ‘‘మా ‘హంట్’ ఆడియో రైట్స్ అమ్మటానికి ప్రయత్నం చేశాం.. కానీ, ‘హంట్’ పేరుతో వేరే చిత్రం కూడా ఉంది కాబట్టి మేము మీ చిత్రం కొనలేమని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరగాలి’’ అని నర్సింగ్ రావు అన్నారు. -
శీలవతికి సర్టిఫికెట్ ఇవ్వని సెన్సార్ బోర్డు
-
సెన్సార్ సభ్యులకు ‘శీలవతి’ రిక్వెస్ట్
చాలా కాలం తరువాత షకీలా లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా శీలవతి. ఈ సినిమా షకీలా 250వ సినిమా కావటం విశేషం. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఈ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టైటిల్ మార్చాలంటూ సెన్సార్ సభ్యులు సూచిస్తున్నారు. కేవలం షకీలా సినిమా అన్న కారణంగానే శీలవతి టైటిల్ మార్చాలంటూ సెన్సార్ సభ్యులు సూచించటంపై నటి షకీలా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా చూడకుండానే టైటిల్ మార్చమని చెప్పటం కరెక్ట్ కాదన్నారు. ఇప్పటికే సినిమా ఆలస్యమైంది, శీలవతి పేరుతో చాలా వరకు ప్రమోషన్ చేశాం ఈ పరిస్థితుల్లో టైటిల్‌ను మార్చలేం అంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. మరి షకీలా చేసిన అభ్యర్థనపై సెన్సార్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
సాయిపల్లవి చిత్రానికి లైన్ క్లియర్
తమిళసినిమా: నటి సాయిపల్లవి నటించిన తొలి తమిళ చిత్రమే ఆటంకాలను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. మాలీవుడ్‌లో ప్రేమమ్‌తోనూ, టాలీవుడ్లో ఫిదా చిత్రంతోనూ అనూహ్య క్రేజ్‌ను సంపాదించుకున్న నటి సాయిపల్లవికి కోలీవుడ్ ఎంట్రీ మాత్రం కాస్త ఆలస్యంగానే జరిగింది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు విజయ్ దర్శకత్వం వహించిన కరు చిత్రం ద్వారా సాయిపల్లవి కోలీవుడ్‌కు పరిచయం కానుంది. టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో చిత్ర టైటిల్ వివాదంలో చిక్కుకుంది. కురు చిత్ర టైటిల్ హక్కులు తనకు చెందినవి అంటూ స్థానికి ఎంజీఆర్ నగర్‌కు చెందిన జేఎస్.స్క్రీన్ సంస్థ అధినేత మణిమారన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సాయిపల్లవి చిత్రం చిక్కుల్లో పడింది. న్యాయస్థానం ఈమె చిత్రానికి కరు టైటిల్‌ను నిషేధించింది. దీంతో లైకా సంస్థ మద్రాసు హైకోర్టులో ఈ చిత్ర టైటిల్‌పై అప్పీల్ చేసుకుంది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తుల బెంచ్ విచారణ చేపట్టింది. ఈ విచారణకు లైకాసంస్థ తరఫు న్యాయవాది హాజరై కరు చిత్రం టైటిల్‌ను తాము ప్రకటించిన తరువాత జేఎస్.స్క్రీన్ సంస్థ అధినేత మణిమారన్ ఈ టైటిల్ తనదంటూ కోర్టును ఆశ్రయించారని, తాము కరు టైటిల్ పేరుతో ఇప్పటికే ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకున్నామని, ఇప్పుడు టైటిల్‌పై నిషేధం విధిస్తే చాలా నష్టపాతామని వాధించారు. ఇరుతరఫు వాదనలు పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తుల బెంచ్ కురు చిత్ర టైటిల్‌పై నిషేధాన్ని తొలగిస్తూ లైకా సంస్థకు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. దీంతో అడ్డంకులు తొలగడంతో సాయిపల్లవి కరు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సన్నాహాలు జరుపుకుంటోందని సమాచారం. ఇందులో సాయిపల్లవి ఒక బిడ్డకు తల్లిగా నటించిందన్నది గమనార్హం. -
నటి శ్రీదేవికి బదులిచ్చిన వర్మ
వివాదాల రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చారు. వర్మ తీయబోతున్న శ్రీదేవి చిత్రంపై వివాదం చెలరేగడంతో ఆయన వాటిపై తనదైన శైలిలో స్పందించారు. ఈ చిత్ర టైటిల్ పై నటి శ్రీదేవి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లాయర్ నోటీసులు పంపిచడంతో వర్మ తాజాగా వివరణ ఇచ్చారు. అసలు నిజజీవితంలో శ్రీదేవికి, తాను తీస్తున్న శ్రీదేవి సినిమాకి ఎటువంటి సంబంధలేదన్నారు. ప్రస్తుతం తాను తీస్తున్న సినిమాలో ఒక టీనేజర్ కుర్రాడుకి 25 ఏళ్ల మహిళపై ఏవిధమైన వ్యామోహం ఉంటుందనేది చిత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కథకు- నటి శ్రీదేవికి ఎటువంటి సంబంధం లేదన్నారు. తాను తీస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో నటిస్తున్నది నటి కానప్పుడు.. ఆ కుర్రాడు దర్శకుడు కానప్పుడు ? వివాదం ఎందుకని అని ప్రశ్నించారు. చిత్రంలోని లీడ్ రోల్ పోషిస్తున్న మహిళకు ఆ టీనేజ్ కుర్రాడికి వయసు పరంగా చాలా గ్యాప్ ఉందని.. నటి శ్రీదేవికి తనకు వయసు వ్యత్యాసం లేనప్పుడు అనవసరం రాద్దాంతం ఎందుకన్నారు. తాను గత ఐదు సంవత్సరాల నుంచి చాలాసార్లు మీడియా ముందు, బయట నటి శ్రీదేవి గురించి చెబుతూనే ఉన్న సంగతి ఈ సందర్భంగా వర్మ గుర్తు చేశారు. అప్పుడు శ్రీదేవి అంశాన్ని కామెడీగా, హెల్తీ స్పిరిట్ గా తీసుకున్నా.. ఇప్పుడు మాత్రం నానా హడావుడి చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ నుంచి ఈ టైటిల్ కు సంబంధించి హక్కులు పొందినట్లు వర్మ తెలిపారు. 'సావిత్రి సినిమా టైటిల్ ను వివాదం చెలరేగడం వల్ల మార్చలేదని, ఆ టైటిల్ ను వేరు వాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నందునే మార్చానని వర్మ తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి మూడుసార్లు ' శ్రీదేవి' పేరు మీద మూడు చిత్రాలు వచ్చాయని వర్మ అన్నారు. ఇదిలా ఉండగా ఆమె ఎంత పెద్ద నటి అయినా పేరుపై ఎటువంటి హక్కులు ఉండవని వర్మ తరుపు న్యాయవాది స్పష్టం చేశారు. శ్రీదేవి నోటీసులపై తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చామన్నారు. ఓ టీనేజ్ కుర్రాడు, ఆంటీ నాభిని చూస్తున్నట్లున్న ప్రచార చిత్రంతో ‘సావిత్రి’ అనే టైటిట్‌తో సినిమా తీయనున్నట్లు వర్మ ప్రకటించగానే మహిళా సంఘాలు నుంచి పెను విమర్శలు ఎదురయ్యాయి. సావిత్రి పేరు పెట్టి, ఇలా తీస్తావా? అని ఘాటుగా స్పందించడంతో టైటిల్‌ని ‘శ్రీదేవి’ అని మార్చారు వర్మ. అయినప్పటికీ ప్రచార చిత్రాల విషయంలో ఇంకా వివాదం జరుగుతూనే ఉంది. తాజాగా తన పేరుతో టైటిల్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి శ్రీదేవి రంగంలోకొచ్చారు. తన పేరుతో సినిమా తీయడం ఏంటి అంటూ వర్మకు లాయర్ నోటీసు పంపించారామె. దక్షిణ, ఉత్తరాది భాషల్లో శ్రీదేవి నటిగా మంచి పేరుందని, ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ఆమె పేరుని.. అందులోనూ అభ్యంతరకరంగా ఉంటుందేమోననే భావనను ప్రచార చిత్రాలు కల్పించిన నేపథ్యంలో ఆమె పేరుని టైటిల్‌గా వాడటం తగదని శ్రీదేవి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. Post by RGV. -
రాంగోపాల్ వర్మకు సినీనటి శ్రీదేవి నోటీసులు!
వివాదాలకు చిరునామా అనదగ్గ విధంగా రామ్‌గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. త్వరలో తాను రూపొందించనున్న చిత్రం విషయమై ఇప్పటికే వర్మ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ టీనేజ్ కుర్రాడు, ఆంటీ నాభిని చూస్తున్నట్లున్న ప్రచార చిత్రంతో ‘సావిత్రి’ అనే టైటిట్‌తో సినిమా తీయనున్నట్లు వర్మ ప్రకటించగానే మహిళా సంఘాలు నుంచి పెను విమర్శలు ఎదురయ్యాయి. సావిత్రి పేరు పెట్టి, ఇలా తీస్తావా? అని ఘాటుగా స్పందించడంతో టైటిల్‌ని ‘శ్రీదేవి’ అని మార్చారు వర్మ. అయినప్పటికీ ప్రచార చిత్రాల విషయంలో ఇంకా వివాదం జరుగుతూనే ఉంది. తాజాగా తన పేరుతో టైటిల్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి శ్రీదేవి రంగంలోకొచ్చారు. తన పేరుతో సినిమా తీయడం ఏంటి అంటూ వర్మకు లాయర్ నోటీసు పంపించారామె. దక్షిణ, ఉత్తరాది భాషల్లో శ్రీదేవి నటిగా మంచి పేరుందని, ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ఆమె పేరుని.. అందులోనూ అభ్యంతరకరంగా ఉంటుందేమోననే భావనను ప్రచార చిత్రాలు కల్పించిన నేపథ్యంలో ఆమె పేరుని టైటిల్‌గా వాడటం తగదని శ్రీదేవి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ‘శ్రీదేవి’ అనే టైటిల్ పెట్టిన విషయం తెలుసుకుని, ఆమె భర్త బోనీకపూర్ వివరణ కోరాలనుకున్నప్పుడు, ఫోన్లోని ‘వాట్సాప్’ ద్వారా ఓ ప్రెస్‌నోట్‌ని పంపించడం, సరైన వివరణ కాదని ఆ లాయర్ అన్నారు. పలు ఇంటర్వ్యూల్లో శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె భర్త బోనీని చూస్తే అసూయగా ఉందని వర్మ పేర్కొనడాన్ని ఈ సందర్భంగా సదరు న్యాయవాది గుర్తు చేశారు. ఈ నోటీసు అందిన మూడు రోజుల్లోగా స్పందించకపోతే తదుపరి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తన కక్షిదారు శ్రీదేవి తరఫున ఆ న్యాయవాది తెలిపారు. ఈ చిత్రం పేరు మార్చుతున్నట్లు లిఖితపూర్వకంగా ఇవ్వాలని, జాతీయ స్థాయి వార్తా పత్రికల్లో క్షమాపణలు చెబుతూ, ప్రకటన ఇవ్వాలని, వేరే కొత్త టైటిల్‌ని కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంకా చట్టప్రకారం బోల్డన్ని నిబంధలను విధిస్తూ.. వర్మకు నోటీసు పంపించారు.