మరో లేడీ డైరెక్టర్‌తో సినిమా | Naga Shourya new movie with Debut Director Lakshmi sowjanya | Sakshi
Sakshi News home page

మరో లేడీ డైరెక్టర్‌తో సినిమా

Sep 20 2019 12:30 AM | Updated on Sep 20 2019 12:30 AM

Naga Shourya new movie with Debut Director Lakshmi sowjanya - Sakshi

నాగశౌర్య

వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు ఓ సినిమాను తీసుకురావడానికి ప్లాన్‌ రెడీ చేసుకున్నారు నాగశౌర్య. ఈ కొత్త చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణల వివరాలను కొన్ని రోజుల్లో ప్రకటిస్తాం.

ఈ సినిమాను వచ్చే ఏడాది మేలో విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఇదిలా ఉంటే లైడీ డైరెక్టర్‌ నందినీరెడ్డితో ‘కళ్యాణ వైభోగమే’ అనే సినిమాలో నటించారు నాగశౌర్య. ఇప్పుడు మరో లేడీ డైరెక్టర్‌ సినిమాకి సైన్‌ చేశారు. ఇది కాకుండా ప్రస్తుతం రమణ తేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమా చేస్తున్నారు నాగశౌర్య. అలాగే నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ దర్శ కత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్‌ అయ్యారు శౌర్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement