PDV Prasad
-
ఈ టైమ్‌లో ఇలాంటి సినిమాలే అవసరం
‘‘డిజె టిల్లు’ యూత్‌ఫుల్ సినిమానే కానీ అడల్ట్ చిత్రం కాదు. ముద్దు సీన్స్ కూడా అడల్ట్ కిందకు వస్తాయనుకుంటే ఎలా? నేటి తరం అమ్మాయి కోణంలో సాగే చిత్రమిది. టిల్లు అనే అమాయకుణ్ణి రాధిక ఎలా ఆడుకుంటుందనేది వినోదాత్మకంగా ఉంటుంది’’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగవంశీ విలేకరులతో చెప్పిన విశేషాలు... ► ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చూశాక సిద్ధు జొన్నలగడ్డను పిలిచాను. ‘డిజె టిల్లు’ అనే యూత్‌ఫుల్ కథ చెప్పాడు. ఈ కథ వింటున్నంత సేపూ నవ్వుకున్నాను.. సినిమా చూసి ప్రేక్షకులు కూడా ఫుల్‌గా నవ్వుకుంటారు. మేము ఓ కథ ఓకే అనుకున్నాక డైరెక్టర్ త్రివిక్రమ్‌గారికి చెబుతాం. ఆయన కథలో మార్పులు, సలహాలు చెబుతారు. ‘డిజె టిల్లు’ పూర్తయ్యాక కూడా త్రివిక్రమ్‌గారు చెప్పడంతో కొన్ని సన్నివేశాలు మళ్లీ తీశాం. ► కరోనా టైమ్‌లో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మేం నిర్మించిన ‘రంగ్ దే, వరుడు కావలెను’ చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని రప్పించాలంటే ‘డిజె టిల్లు’లాంటి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలే అవసరం. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. ప్రస్తుతం మా బ్యానర్లో తీస్తున్న ‘స్వాతిముత్యం, ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు కూడా ఇన్నోవేటివ్ అప్రోచ్‌తో చేస్తున్నవే. ► ‘భీమ్లా నాయక్’ పెద్ద సినిమా కాబట్టి ఏపీలో థియేటర్లలో 100 శాతం సీటింగ్, సెకండ్ షోకి అనుమతి ఉన్నప్పుడే విడుదల చేస్తాం. టిక్కెట్ ధరల విషయం సమస్య కాదు. అన్నీ బాగుంటే ఈ నెల 25నే ‘భీమ్లా నాయక్’ను రిలీజ్ చేస్తాం. -
టాలీవుడ్ నిర్మాత ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత పీడీవీ ప్రసాద్ సతీమణి అంజు ప్రసాద్(53) గుండెపోటుతో మరణించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు తుదిశ్వాస విడిచారు. పీడీవీ ప్రసాద్ దంపతులకు ఇద్దరు సంతానం. కాగా అంజు ప్రసాద్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖలు నివాళులు అర్పిస్తున్నారు. కాగా పీడీవీ ప్రసాద్.. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థలు హారిక హాసిని నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: మన యుద్ధం మనమే చేయాలి..) -
మరో లేడీ డైరెక్టర్‌తో సినిమా
వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు ఓ సినిమాను తీసుకురావడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు నాగశౌర్య. ఈ కొత్త చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణల వివరాలను కొన్ని రోజుల్లో ప్రకటిస్తాం. ఈ సినిమాను వచ్చే ఏడాది మేలో విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఇదిలా ఉంటే లైడీ డైరెక్టర్ నందినీరెడ్డితో ‘కళ్యాణ వైభోగమే’ అనే సినిమాలో నటించారు నాగశౌర్య. ఇప్పుడు మరో లేడీ డైరెక్టర్ సినిమాకి సైన్ చేశారు. ఇది కాకుండా ప్రస్తుతం రమణ తేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమా చేస్తున్నారు నాగశౌర్య. అలాగే నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ దర్శ కత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు శౌర్య. -
డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే
‘ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్‌మహల్ కట్టాడంటే డబ్బులు ఎక్కువై అనుకున్నా.. కొంతమంది కోసం కట్టొచ్చు.. ఖర్చు పెట్టొచ్చు, పవర్ ఉంటే సరిపోదు.. అది ఎవరిమీద ఉపయోగించాలో కూడా తెలుసుకో, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉందంటే అది డబ్బొక్కటే, మూడో ప్రపంచ యుద్ధం నీళ్ల కోసమే అంటే నమ్మలేదు.. ఇప్పుడు నమ్మక తప్పట్లేదు’... అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగులు ‘రణరంగం’ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. శర్వానంద్ హీరోగా, కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘సుధీర్ వర్మ ‘రణరంగం’ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. శర్వానంద్ ఇందులో పోషించిన గ్యాంగ్‌స్టర్ పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా, ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. మంచి భావోద్వేగాలుంటాయి. హీరో జీవితంలో 1990, ప్రస్తుతకాలంలోని సంఘటనల సమాహారమే మా ‘రణరంగం’. కాకినాడలో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కాజల్ అగర్వాల్, కల్యాణీల పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ పిళ్లై, కెమెరా: దివాకర్ మణి. -
' ప్రేమమ్' చిత్రం అడియో ఫంక్షన్
-
ఆ నవ్వుతోనే చైతూ ఓ హీరోయిన్ని పడేశాడు!
- దాసరి ‘‘చైతూ (నాగచైతన్య) ని చూస్తుంటే మనింట్లో, పక్కింట్లో ఉండే బ్రదర్‌లా తమాషాగా ఉంటాడు. మాటలతో, నవ్వుతో పడేస్తాడు. చైతూ నవ్వులో చాలా మాయ ఉంది. ఆ నవ్వుతోనే ఓ హీరోయిన్ని పడేశాడు. ‘ఏ మాయ చేసావె’తో ఆ హీరోయిన్ ఏ మాయ చేసిందో!’’ అని చమత్కారంగా అన్నారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. నాగచైతన్య హీరోగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఎస్.నాగవంశీ నిర్మించిన చిత్రం ‘ప్రేమమ్’. చందు మొండేటి దర్శకుడు. గోపీ సుందర్, రాజేశ్ మురుగేశన్ సంగీతమందించిన ఈ చిత్రం పాటలను ఏయన్నార్ జయంతి సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. దాసరి పాటల సీడీలను ఆవిష్కరించారు. హీరో అఖిల్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. నాగార్జున మాట్లాడుతూ : ‘‘ప్రేమకథా చిత్రాలను మీరెప్పుడూ (ప్రేక్షకులు) ఆదరించారు. నాన్నగారి ‘దేవదాసు’, ‘ప్రేమాభిషేకం’, నా ‘గీతాంజలి’ చిత్రాలకు సరిపోయే ప్రేమకథ ఈ ‘ప్రేమమ్’. ఈ చిత్రం కోసం చైతూ గడ్డం పెంచిన ప్పుడు.. బాగుంది. నేను ‘ఓం నమో వెంకటేశాయ’కి పెంచితే బాగుంటుందని ఆలోచించా. పెంచిన తర్వాత చైతూ నా గడ్డమే బాగుందన్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ చిత్రం తెలుగు లోనూ అంతే హిట్టవుతుందని నా నమ్మకం. అక్టోబర్ 7న ఈ చిత్రం రిలీజ్ చేయాలనుకుంటున్నారు’’ అన్నారు. దాసరి మాట్లాడుతూ : ‘‘ఏయన్నార్గారిది, నాది యాభై ఏళ్ల అనుబంధం. ఆయన కెరీర్లో 27 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుణ్ణి నేనే. అందులో 22 ప్రేమకథలే. ప్రేమకు, ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ అక్కినేని. ప్రేమకు అర్థం అక్కినేని కుటుంబం. అదే చరిత్ర నాగార్జునతో కంటిన్యూ అయ్యింది. ఈ రోజున చైతూతో రిపీట్ కాబోతోంది. అఖిల్‌తో కూడా కంటిన్యూ కావాలని మనసారా కోరు కుంటున్నా. ‘ఏ మాయ చేశావే’, ‘100 పర్సంట్ లవ్’లో చైతూ అక్కినేని వారసుడు అనిపించాడు. మధ్యలో యాక్షన్ సినిమాలు చేసినప్పుడు నాగార్జునతో వద్దని చెప్పా. ప్రేమకు మరణం లేదు. వందమందిని కొట్టేసే హీరోగా కాకుండా, వందమంది అమ్మాయిల హార్ట్ దోచుకునే హీరోగా చైతూ పేరు తెచ్చుకోవాలి. ఏయన్నార్‌గారి అశీస్సులతో నా ఆప్తుడు చినబాబు (ఎస్.రాధాకృష్ణ) కుమారుడు నాగవంశీ నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, తర్వాత అఖిల్ ప్రేమకథే చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సినిమాలు హిట్టైనా.. ఫ్లాపైనా.. కొన్నేళ్లుగా నన్ను సపోర్ట్ చేసింది మా అభిమానులే. బాగా ప్రేమించి చేసిన చిత్రమిది’’ అన్నారు నాగచైతన్య. ‘‘ట్రైలర్ చూస్తుంటే మా అన్నయ్య ఈ ప్రపంచంలో ప్యూరెస్ట్ లవర్ అనిపిస్తోంది. ప్రేమకథల్లో తనతో నేను పోటీపడలేను.. ఫాలో అయిపోతా’’ అన్నారు అఖిల్. చిత్ర నిర్మాతలు నాగవంశీ, ఎస్.రాధాకృష్ణ, దర్శకుడు చందు మొండేటి, సంగీత దర్శకులు రాజేశ్ మురు గేశన్, గోపీసుందర్, హీరోయిన్లు శ్రుతీ హాసన్, మడోన్నా, నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకులు మారుతి, కల్యాణ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హీరోయిన్లు అంత ఈజీగా దొరుకుతారా?
30 ఇయర్స్ ఇండస్ట్రీ... అదే ఎనర్జీ... సినిమా తర్వాత సినిమా చేస్తూ వెంకటేశ్ బిజీగా ఉంటున్నారు. ఇన్నేళ్లుగా యాక్ట్ చేస్తున్నప్పటికీ ప్రేక్షకులకు ఆయన ఏమాత్రం బోర్ కొట్టలేదు. ఈ ఫ్యామిలీ హీరో నటించిన ‘బాబు బంగారం’ ఈ నెల 12న విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. వెంకీ చెప్పిన విశేషాలు... ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ రీమేక్స్ తర్వాత స్ట్రయిట్ సినిమాతో వస్తున్నారు? నాకు రీమేక్, స్ట్రయిట్ అనే భేదం లేదు. కాన్సెప్ట్ ఫ్రెష్‌గా ఉండాలి. చాలా రోజులుగా మారుతి నాతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. గతంలో ‘రాధ’ చేయాల్సింది. కానీ, మెటీరియలైజ్ కాలేదు. ‘బాబు బంగారం’ కథ చెప్పగానే బాగా నచ్చింది. సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ‘బాబు బంగారం’ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మంచి కథ, కామెడీ.. అన్నీ కుదిరాయి. నా క్యారెక్టరైజేషన్లో రెండు వేరియేషన్స్ ఉంటాయి. గత ఐదేళ్లలో స్క్రీన్‌పై నేనిలా కనిపించలేదు. డ్రెస్సింగ్ స్టైలిష్‌గా ఉంటుంది. చెప్పకూడదు గానీ.. చూడ్డానికి చాలా బాగున్నాను (నవ్వుతూ). జిబ్రాన్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. ఓ పెద్ద హీరోతో మారుతి పని చేయడం ఇదే తొలిసారి. ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? మారుతి వెరీ వెరీ కూల్ అండ్ ఫ్రెండ్లీ డెరైక్టర్. ఎప్పుడూ అప్సెట్ అవ్వడు, కన్ఫ్యూజన్ అసలు ఉండదు. ఓ ప్రేక్షకుడిగా ఆలోచిస్తాడు. మారుతి వర్కింగ్ స్టైల్ చూస్తే నాకు సీనియర్ దర్శకులు గుర్తొచ్చారు. ఎవరైనా సలహా ఇస్తే ఆలోచిస్తాడు, స్వీకరిస్తాడు. ‘భలే భలే మగాడివోయ్’కి ముందు మారుతి చేసిన చిత్రాలు ఆయనకు వేరే ఇమేజ్ తెచ్చాయ్ కదా..? ‘భలే భలే మగాడివోయ్’కి ముందే మారుతీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నా. మామూలుగా దర్శకుడి గత సినిమా సక్సెస్, ఫెయిల్యూర్లు, ఇమేజ్ను సురేశ్ ప్రొడక్షన్స్ పట్టించుకోదు. కథ నచ్చితే చాన్స్ ఇస్తుంది. నేనూ అంతే. సీనియర్ హీరోలకు హీరోయిన్ సమస్య ఉన్నట్టుంది? ఉంటుంది. ఇప్పుడు మా వయసు ఏంటి? హీరోయిన్లు అంత ఈజీగా దొరుకుతారా.. ఏంటి? నిజం అంగీకరించక తప్పదు. గతంలో నేను 26 మంది హీరోయిన్లను పరిచయం చేశాను. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలి (నవ్వుతూ..) ముందు స్క్రిప్ట్ దొరకాలి. వయసుకు తగ్గ పాత్రలు వస్తే.. తర్వాత హీరోయిన్ ఎవరో ఒకరు దొరుకుతారు. హీరోగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? 30 ఏళ్లైనా ప్రేక్షకులు ఇంకా నన్ను చూస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. షూటింగ్ మధ్యలో ఉండగానే చాలా సినిమాలు ఫ్లాప్ అవుతాయని తెలుస్తుంది. నటుడిగా అంతకంటే వరస్ట్ థింగ్ ఇంకొకటి ఉండదు. బయటకు మన బాధ చెప్పుకోలేం. పైగా నవ్వుతూ షూటింగ్ చేయాలి. అటువంటి సందర్భాల్లో కూడా అద్భుతాలు జరిగాయి. ఎక్కడో ఓ సినిమా విడుదలవుతుంది. ఓ ఇరవై సన్నివేశాలు కాపీ చేసి మన సినిమాలో పెట్టేస్తారు. అంతా హ్యాపీ.‘ఇండియానా జోన్స్’ స్ఫూర్తితో ‘బొబ్బిలి రాజా’ సెకండాఫ్ తీశాం. ఇలాంటివి ఎన్నో జరిగాయి. మీ అబ్బాయి అర్జున్ వచ్చే వరకూ సినిమాల్లో నటిస్తానన్నారు. తనను హీరో చేస్తారా? మొన్నా మధ్య క్రికెట్ లీగ్‌లో ఎవరో ‘మీ నాన్న పెద్ద హీరో. ఆయన బాటలో నడుస్తావా?’ అనడిగారు. ‘ఐ హావ్ గాట్ మై ఓన్ ఫుట్ స్టెప్స్. మై ఓన్ ఐడెంటిటీ’ అన్నాడు. 8వ తరగతి చదువుతున్నాడు. బాస్కెట్‌బాల్ బాగా ఆడుతున్నాడు. ఏమవుతాడో చూద్దాం. ‘గోపాల గోపాల’ తర్వాత ఆర్నెల్లు గ్యాప్. ఇప్పుడేమో వరుసగా సినిమాలు ఒప్పుకున్నారు? మంచి కథలొస్తున్నాయి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా ఉంది. రానాతో ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ వెంకటేశ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో పూస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్న చిత్రానికి ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘‘కిశోర్ తిరుమల కథ చెప్పగానే నాకు సూటవుతుందా? అన్నాను. ‘మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఎక్స్ప్రెషన్, ఈ కామెడీ టైమింగ్ చాలు’ అన్నాడు. సరే అన్నాను. మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రం ఆరంభమవుతుంది.