శర్వానంద్ , కాజల్ అగర్వాల్
‘ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్‌మహల్ కట్టాడంటే డబ్బులు ఎక్కువై అనుకున్నా.. కొంతమంది కోసం కట్టొచ్చు.. ఖర్చు పెట్టొచ్చు, పవర్ ఉంటే సరిపోదు.. అది ఎవరిమీద ఉపయోగించాలో కూడా తెలుసుకో, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉందంటే అది డబ్బొక్కటే, మూడో ప్రపంచ యుద్ధం నీళ్ల కోసమే అంటే నమ్మలేదు.. ఇప్పుడు నమ్మక తప్పట్లేదు’... అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగులు ‘రణరంగం’ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. శర్వానంద్ హీరోగా, కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘సుధీర్ వర్మ ‘రణరంగం’ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. శర్వానంద్ ఇందులో పోషించిన గ్యాంగ్‌స్టర్ పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా, ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. మంచి భావోద్వేగాలుంటాయి. హీరో జీవితంలో 1990, ప్రస్తుతకాలంలోని సంఘటనల సమాహారమే మా ‘రణరంగం’. కాకినాడలో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కాజల్ అగర్వాల్, కల్యాణీల పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ పిళ్లై, కెమెరా: దివాకర్ మణి.
Comments
Please login to add a commentAdd a comment