
‘ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణ వైభోగం’ వంటి సినిమాలతో అలరించారు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పని చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కన్నడ ‘కిరిక్ పార్టీ’ ఫేమ్ రష్మికా మండన్న కథానాయిక. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘ఛలో’ టైటిల్ ఖరారు చేశారు. ఉషా మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ లవ్‌స్టోరీ, క్లైమాక్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన చిత్రమిది.
మేము సినిమా నిర్మాణంలోకి వస్తామనుకోలేదు. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో, ఈ సినిమాను నిర్మిద్దామనుకున్నాం. కెమెరామేన్ సాయి శ్రీరామ్‌గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. కథలు నచ్చితే బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. ‘‘ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో జరిగే కాలేజ్ లవ్‌స్టోరీ ఇది. హైదరాబాద్ నుంచి హీరో తిరుపురం వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందన్నది ఆసక్తిగా ఉంటుంది. నాగశౌర్యను నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు శంకర ప్రసాద్ ముల్పూరి. ఈ సినిమాకి సంగీతం: సాగర్ మహతి.