శిరోముండనం కేసులో పీపీ తొలగింపుపై 3న చలో కాకినాడ | siromundanam case chalo kakinada | Sakshi
Sakshi News home page

శిరోముండనం కేసులో పీపీ తొలగింపుపై 3న చలో కాకినాడ

Published Wed, Sep 28 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

కాకినాడ సిటీ: వెంకటయ్యపాలెం దళితుల శిరోముండనం కేసులో అధికారం అండతో పీపీని తొలగించడాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 3న చలో కాకినాడ నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి తెలిపారు.

కాకినాడ సిటీ: వెంకటయ్యపాలెం దళితుల శిరోముండనం కేసులో అధికారం అండతో పీపీని తొలగించడాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 3న చలో కాకినాడ నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి తెలిపారు. బుధవారం స్థానిక సుందరయ్యభవన్‌లో సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, లిబరేషన్, న్యూడెమోక్రసీ, జనశక్తి వామపక్ష పార్టీలతో పాటు దళిత సంఘాల నాయకులు విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ పాలకులకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఏపాటిదో ఈ కేసుతో అర్థమవుతుందన్నారు. దువ్వా శేషుబాబ్జి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును ఒకసారి రద్దు చేసిందని తిరిగి హైకోర్టు జోక్యంతో కేసును పున్నయ్య కమిషన్‌ పునఃప్రారంభించిందన్నారు. దళితులందరూ 3న చలో కాకినాడకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 26కి ఈ కేసుతుది విచారణకు వచ్చే ముందు ఈ నెల 23న పీపీని తొలగిస్తూ  జీఓ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ పార్టీలోని దళితులందరూ ఆత్మపరిశీలన చేసుకుని తోట త్రిమూర్తులను శిక్షించేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. 3న ఉదయం 10 గంటలకు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుందని 11 గంటలకు కలెక్టరేట్‌ ముట్టడికి తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఎ.రామేశ్వరరావు(ఆర్‌పీఐ), బి.రమేష్‌(జనశక్తి), ఎం.కృష్ణమూర్తి (కేవీపీఎస్‌), తోకల ప్రసాద్‌ (డీహెచ్‌పీఎస్‌), ఎం.డేవిడ్‌రాజు(కేవీపీఎస్‌), జుత్తుక కుమార్‌ (ఏఐటీయూసీ) పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement