‘‘ఛలో’ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. రిలీజ్ చేసిన తొలి పాటకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సాగర్ మహతి చక్కటి సంగీతం అందించారు. సాగర్ తండ్రి మణిశర్మగారు మ్యూజిక్ బ్రహ్మ అయితే, సాగర్‌కి మ్యూజిక్ ప్రిన్స్ అని పేరు పెట్టాలనుకుంటున్నా’’ అన్నారు నాగశౌర్య. ఆయన హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముప్పలూరి సమర్పణలో ఉషా ముప్పలూరి నిర్మిస్తున్న సినిమా ‘ఛలో’. ఈ చిత్రం తొలి పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి మా అమ్మ, నాన్నలే నిర్మాతలు. నాకు నచ్చిన స్క్రిప్ట్‌ను నమ్మి, వారు ఈ సినిమా చేస్తున్నారు. కన్నడ హిట్ మూవీ ‘కిరిక్ పార్టీ’ రష్మిక మండన్నా చక్కగా నటించారు. సాయిశ్రీరామ్ ప్రతి సీన్‌ను అందంగా చూపించారు’’ అన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దు టైమ్‌లో నా కథ ఓకే చేశారు. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా అడిగిన దాని కంటే ఎక్కువగానే ఇచ్చారు నిర్మాతలు. సినిమా బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శంకర్ ప్రసాద్ ముప్పలూరి.
Comments
Please login to add a commentAdd a comment